ఈ నిర్మాత డేట్లు దొరకడం కష్టమే !!

0
4

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత ‘దిల్’ రాజు ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈ సంవత్సరంలో రెండు నెలలు తిరక్కుండానే శర్వానంద్ తో ‘శతమానం భవతి’, నాని తో ‘ నేను లోకల్’ తో రెండు బ్లాక్ బస్టర్ లు ఇవ్వడమే కాకుండా తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఆ సినిమాలు భారీ లాభాల్ని మూటగట్టుకుని ‘దిల్’ రాజు అభిరుచి గల నిర్మాత మాత్రమే కాకుండా మంచి క్రియేటర్ గా కూడా పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ‘దిల్’ రాజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాధం’, వరుణ్ తేజ్ హీరో గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమాలు నిర్మిస్తున్నారు.

‘దిల్’ రాజు ఈ మధ్యనే అబుదాబి లో జరుగుతున్న ‘డి.జె’ షూటింగ్ పనులు చూసుకుని హైదరాబాద్ వచ్చి సూపర్ స్టార్ మహేష్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మించనున్న సినిమా స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల ‘ఫిదా’ షూటింగ్ లో అమెరికాలో ఉన్నారు. అక్కడి నుండి రాగానే వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో నాని హీరో గా చేయనున్న ‘ఎం.సి.ఏ’ సినిమా పనులు చూడనున్నారు. ఇలా ప్రస్తుతం ‘దిల్’ రాజు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆయనకి కథ వినిపించాలనుకునే కొత్త దర్శకులు మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here