‘విన్నర్’కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందంగా వుంది – హీరో సాయిధరమ్ తేజ్

0
446

‘పిల్లా నువ్వు లేని జీవితం’, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’, ‘సుప్రీమ్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో కమర్షియల్‌గా పెద్ద హిట్స్‌ సాధించి హీరోగా మంచి ఇమేజ్‌ని సంపాదించుకున్న సాయిధరమ్‌తేజ్‌ లేటెస్ట్‌గా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మించిన ‘విన్నర్‌’ చిత్రంతో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో ‘విన్నర్‌’ సాయిధరమ్‌తేజ్‌తో ఇంటర్వ్యూ..

‘విన్నర్‌’కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
– చాలా బాగుంది. ఒక వర్గం ఆడియన్స్‌ అని కాకుండా చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు, మాస్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ నేను, జగపతిబాబుగారు కలిసి చేసిన సీన్స్‌ చాలా బాగున్నాయని, ఎమోషన్స్‌ బాగా వర్కవుట్‌ అయ్యాయని అప్రిషియేట్‌ చేస్తున్నారు. కలెక్షన్స్‌ డే బై డే పెరుగుతూ వస్తున్నాయి. కమర్షియల్‌గా ప్రొడ్యూసర్స్‌ చాలా హ్యాపీగా వున్నారు.

కథలో మీకు ఏ అంశం నచ్చి ఈ సినిమాకి ఓకే చెప్పారు?
– సెకండాఫ్‌లో తండ్రీ కొడుకుల మధ్య సీన్స్‌ బాగా నచ్చాయి. అలాగే జాకీ బ్యాక్‌డ్రాప్‌ కొత్తగా అనిపించింది.

ఇంతకుముందే హార్స్‌ రైడింగ్‌ నేర్చుకున్నారా?
– ఓ పదిరోజులు ట్రైనింగ్‌ తీసుకున్నాను. తర్వాత క్లైమాక్స్‌ చేస్తున్నప్పుడు ఒకరోజు ట్రైనింగ్‌ ఇచ్చారు. హాలీవుడ్‌ మాస్టర్‌ నన్ను ట్రైన్‌ చేసారు. వాళ్ళు అనుకున్న ఔట్‌పుట్‌ ఇవ్వగలుగుతానా? లేదా? అని మొదట భయపడ్డాను. అయితే చెయ్యగా చెయ్యగా అలవాటైపోయింది.

‘విన్నర్‌’ కమర్షియల్‌గా మీ కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అనుకోవచ్చా?
– నిజం చెప్పాలంటే కలెక్షన్లు, ఫిగర్స్‌.. ఇలాంటి వాటి గురించి నేను అస్సలు ఆలోచించను. ‘విన్నర్‌’ అనే సినిమాలోని నా క్యారెక్టర్‌కి ఎంత వరకు న్యాయం చెయ్యగలనో అంత చేశాను. ప్రేక్షకులకు నచ్చింది. అందుకే పదే పదే చూస్తున్నారు. కమర్షియల్‌గా నా గత చిత్రాలతో పోల్చి చూసుకోలేదు. ఏది ఏమైనా డబ్బు పెట్టి సినిమా తీసిన నిర్మాతలకు లాభాలు వస్తే నేను చాలా సంతోషపడతాను.

ఈ సినిమాని చాలా ఎక్కువ బడ్జెట్‌తో చేసారని తెలిసింది. ఎంతవరకు నిజం?
– స్టోరీ మీద వున్న నమ్మకంతోనే నా నిర్మాతలు ఎక్కువ ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. మంచి సబ్జెక్ట్‌. సినిమా రిచ్‌గా రావాలంటే దానికి తగ్గట్టుగా ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది ఛోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ ఈ సినిమాకి చాలా ప్లస్‌ అయింది. అందుకే విజువల్స్‌ అన్నీ చాలా రిచ్‌గా వచ్చాయి. సినిమా చూసిన వాళ్ళు విజువల్స్‌ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు.

మీ ఫ్యామిలీ మెంబర్స్‌ సినిమా చూసి ఏమన్నారు?
– సినిమా చూశాక అమ్మ చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. మా బ్రదర్‌, నా ఫ్రెండ్‌ హీరో నవీన్‌ నాకు బెస్ట్‌ క్రిటిక్స్‌. వాళ్ళకి సినిమా బాగా నచ్చింది. జగపతిబాబుగారితో చేసిన సెంటిమెంట్‌ సీన్స్‌ బాగా నచ్చాయని చెప్పారు. చిరంజీవిగారు ఈరోజుగానీ, రేపుగానీ సినిమా చూస్తానని చెప్పారు.

జగపతిబాబుగారితో కలిసి నటించడం ఎలా అనిపించింది?
– చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఎందుకంటే మనకి వున్న మంచి నటుల్లో జగపతిబాబుగారు ఒకరు. నేను రీటేక్స్‌ చేస్తున్నప్పుడు చాలా ఓపికగా వుండేవారు. నన్ను బాగా సపోర్ట్‌ చేశారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో సాయిధరమ్‌తేజ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here