డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొత్త సినిమా ‘రోగ్’ ప్రేమికుల రోజున విడుదలైంది. పూరి మార్క్ తో ఉన్న పోస్టర్ మంచి స్పందన ని రాబట్టింది. తల కిందులుగా వేలాడుతున్న యువకుడి తో చూడగానే ఆసక్తి రేపేలా ఉన్న పోస్టర్ డిజైన్ చర్చనీయాంశమైంది. దీనికి తోడు ‘మరో చంటిగాడి ప్రేమ కథ’ అనే టాగ్ లైన్ తో పూరి మరో ‘ఇడియట్’ కి సిద్దమైనట్లు కనిపిస్తోంది. ఇషాన్ ని పరిచయం చేస్తూ తెలుగు,కన్నడ లో ద్విభాష చిత్రం గా పూరి ‘రోగ్’ ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే విడుదలకి సిద్ధం అవుతున్న ‘రోగ్’ తో పూరి మరో సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నట్టే


