12.5 కోట్లకు `ఘాజీ` డిజిట‌ల్ హ‌క్కులు కొన్న అమెజాన్‌

0
361

స‌బ్‌మెరైన్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన అండ‌ర్‌వాట‌ర్ మూవీ `ఘాజీ` చ‌క్క‌ని చిత్రంగా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఇంటా బ‌య‌టా ఈ సినిమాపై చ‌క్క‌ని అంచ‌నాలున్నాయి. ఈనెల 17న సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతున్న సంగ‌తి విధిత‌మే. ఈ శుభ‌వేళ‌ `ఘాజీ` టీమ్‌కి మ‌రో గుడ్ న్యూస్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ 12.5కోట్లు వెచ్చించి ఘాజీ డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల రిలీజ్ హ‌క్కులు 7 సంవత్సరాలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేయ‌డం విశేషం. ఓవర్సీస్‌ రైట్స్ చ‌క్క‌ని రేటుకే అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. సబ్‌మెరెన్‌ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో రానా, తాప్సీ, ఓంపురి, నాజర్‌, కేకే మీనన్‌ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, పీవీపీ సంస్థ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here