నవరస నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించి, అందులో తాను కథానాయకుడిగా నటిస్తానని నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ప్రస్తుతం సినిమా కథాంశం కోసం పరిశోధిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ( కృష్ణా జిల్లా పామర్రు మండలం)లో నారా లోకేష్ సహా సాగించిన పర్యటనలో బాలయ్య పైవిధంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ-“ఎన్టీఆర్ జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చాలి. నాకు నిమ్మకూరు, హిందూపురం రెండూ సమానమే“నని అన్నారు. తన పీఏపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని.. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా బాలయ్య హెచ్చరించారు.


