మెగాస్టార్‌కి క‌ళాత‌పస్వి ఘ‌న‌మైన ప్ర‌శంస‌

0
310

మెగాస్టార్ చిరంజీవి- క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ అనుబంధం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ‘శుభలేఖ’, ‘ఆపద్బాంధవుడు’, ‘స్వయం కృషి’ వంటి కళాత్మక చిత్రాలు వ‌చ్చాయి. తెలుగు ప్రేక్ష‌కుల్ని విశేషంగా ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. దాదాపు పదేళ్ల‌ విరామం తరువాత చిరు నటించిన ‘ఖైదీ నంబర్‌.150’ అసాధార‌ణ విజ‌యం సాధించి 150 కోట్లు వ‌సూలు చేసింది. దీంతో ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా ప‌లువురు ఈ మూవీని చూసిచిరుపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ జాబితాలో కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కూడా చేరిపోయారు. ఆదివారం రాత్రి ఖైదీ.. స్పెషల్‌ షోను చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌తో కలిసి వీక్షించారు. అనంత‌రం చిరుపై కె.విశ్వ‌నాథ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

సినిమా చాలా బావుంది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరు ఎనర్జీలో కానీ, గ్రేస్‌లో కానీ ఏ మాత్రం తేడా రాలేదు. అదే ఎనర్జీ ఆయన అభినయంలో కూడా కనిపించింది.. సినిమా బాగా ఎంజాయ్ చేశాన‌“ని కె.విశ్వ‌నాథ్ అన్నారు. చిరంజీవి ఇక‌మీద‌టా నట‌న‌లో కొన‌సాగాలి. మ‌రిన్ని మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని ఆకాంక్షించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here