అడివి శేష్ హీరోగా `చ‌దురంగ వేట్టై`ను తెలుగులో రీమేక్ చేస్తున్న శ్రీదేవి మూవీస్

0
147

త‌మిళంలో ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లేకుండా చిన్న చిత్రంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం మూట‌గ‌ట్టుకున్న చిత్రం `చ‌దురంగ వేట్టై` తెలుగులో రీమేక్ అవుతోంది. ఇటీవ‌లే `జెంటిల్‌మ‌న్`తో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తోంది. `క్ష‌ణం`తో హీరోగా ఒక ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తెచ్చుకుని ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న అడివి శేష్ ఇందులో క‌థానాయ‌కుడు. `ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` ఫేమ్ నందితా శ్వేత నాయిక‌గా ఎంపిక‌య్యారు. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ ప‌తాకంపై ర‌మేశ్‌.పి.పిళ్లై నిర్మిస్తున్నారు. గోపీ గ‌ణేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. వ‌సంత పంచ‌మిని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం హైద‌రాబాద్‌లోని సినిమా కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయని. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని, జులైలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రానికి మాట‌లు : కిర‌ణ్ త‌ట‌వ‌ర్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here