మ‌హేష్-మురుగ‌దాస్‌ ముంబైకి ప‌య‌నం..

0
75

సూప‌ర్‌స్టార్ మహేష్‌ హీరోగా ఏ.ఆర్‌.మురగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్ర‌సాద్‌- `ఠాగూర్` మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ జెట్‌స్పీడ్‌తో సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ ప‌రిస‌రాల్లో షూటింగ్ సాగుతోంది. ఈనెల 29తో హైద‌రాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని, త‌దుప‌రి కొత్త‌ షెడ్యూల్ కోసం ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ముంబై వెళుతున్నారు. ఈ షెడ్యూల్ త‌ర్వాత‌ పూణేలో షూటింగ్ చేస్తారు. త‌దుప‌రి పాటల చిత్రీక‌ర‌ణ‌కు విదేశాలు వెళ‌తారు. సైమ‌ల్టేనియ‌స్‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని పూర్తి చేసి స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

మహేష్ త‌న కెరీర్‌లోనే ది బెస్ట్ రోల్ ఈ సినిమాలో చేస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రిమినల్స్ భ‌ర‌తం ప‌ట్టే ఇంటలిజెన్స్ అధికారిక‌గా క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రంలో అందాల ర‌కూల్ ప్రీత్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కోలీవుడ్‌ డైరక్టర్‌ ఎస్‌.జే.సూర్య, హీరో భరత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హ్యారిష్‌ జైరాజ్ ట్యూన్స్ ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here