“నాగార్జునగారు, రాఘవేంద్రరావుగారు వంటి లెజెండ్స్ తో `ఓం నమో వేంకటేశాయ` చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను” – సౌరవ్ జైన్

0
429

అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తి కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్‌పై ఎ.మహేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 10న సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్రలో నటించిన సౌరవ్‌ జైన్‌ శనివారం పాత్రికేయులతో ముచ్చటించారు…..

బ్యాక్ గ్రౌండ్……

-మా అమ్మ లాయర్‌. భార్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నాన్న బిజినెస్‌ చేసేవారు. ఇప్పుడు ఆయన లేరు. నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. కంపూటర్స్ లో గ్రాడ్యుయేషన్‌ను ఢిల్లీలో చేశాను. పూణేలో ఎం.బి.ఎ చేశాను. మోడలింగ్‌ చేయడంతో ఈ టీవీ రంగం వైపు అడుగులేశాను.

టాలీవుడ్ లో అవకాశం….
– ‘ఓం నమో వేంకటేశాయ’ నాకు తెలుగులో తొలి సినిమా. అంత కంటే ముందు నేను ఓ ఇరానీ మూవీలో యాక్ట్‌ చేశాను. హిందీ సీరియల్‌ మహాభారత్‌లో కృష్ణుడు రోల్‌ చేశాను. అది చూసిన భారవిగారు డైరెక్టర్ రాఘవేంద్రరావుగారికి చెప్పడం డైరెక్టర్ గారు నన్ను ఓం నమో వేంకటేశాయలో యాక్ట్ చేయమని అన్నారు. అలా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను.

ఆయన్ను ఫాలో అయిపోయానంతే….
– రాఘవేంద్రరావుగారు నన్ను కలిసినప్పుడు వెంకటేశ్వరస్వామి రోల్‌కు నేను న్యాయం చేయలేనేమోనని అన్నాను. అయితే డైరెక్టర్‌గారు, సౌరవ్‌..అంతా నేను చూసుకుంటాను..అని అన్నారు. ఆయన అన్నట్లుగానే నా రోల్‌కు సంబంధించిన వర్క్‌ అంతా ముందుగానే ఎలా డైలాగ్స్‌ చెప్పాలి. అనే విషయాలపై ఆయన దగ్గరుండి చూసుకున్నారు. దీంతో పాటు తెలుగు, ఇంగ్లీష్‌ తెలిసిన ట్యూటర్‌ను కూడా పెట్టారు. సన్నివేశాలను ఎలా చేయాలో ప్రాక్టీస్‌ చేసేవాడిని. నేను ఎలాంటి ప్రామ్‌ప్టింగ్‌ను వాడలేదు. అల్రెడి నేను కృష్ణుడు క్యారెక్టర్‌ చేసి ఉండటం వల్ల, డైరెక్టర్‌గారు కథ చెప్పగానే వెంకటేశ్వరస్వామి గురించి ఒక అవగాహన కలిగింది. సెట్స్‌ లోకి రాగానే రాఘవేంద్రరావుగారు చెప్పిన విధంగా ఫాలో అయిపోయానంతే.

రాఘవేంద్రరావుతో వర్కింగ్‌ ఎక్స్‌ పీరియెన్స్‌?
– ఓం నమో వేంకటేశాయ చిత్రంలో రాఘవేంద్రరావుగారితో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. లైఫ్‌ టైమ్‌లో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం. వర్క్‌ పట్ల ప్యాషన్‌ ఉన్న డైరెక్టర్‌. ఈ ఏజ్‌లో కూడా ఆయన కొత్తగా ఆలోచిస్తున్నారు. చాలా క్లారిటీతో ఓ సీన్‌ను ఎలా చేయాలో అలా నటీనటుల నుండి రాబట్టుకుంటారు.

నాగార్జునతో పనిచేయడం ఎలా అనిపించింది?
– ఇంతకు ముందు చెప్పిన విధంగా నాగ్‌ సార్‌తో వర్క్‌ చేయడం..జీవితంలో మరచిపోలేని అనుభూతినిచ్చింది. నటుడుగానే కాదు, వ్యక్తిగా కూడా ఎలా ఉండాలో ఆయన నుండి నేర్చుకున్నాను. చాలా పెద్ద స్టార్‌ అయినా, చాలా కేరింగ్‌గా, హంబుల్‌గా ఉంటారు. ఆయనతో వర్క్‌ చేయడం ఆశీర్వాదంగా భావిస్తాను. నాగార్జునగారు, రాఘవేంద్రరావుగారు వంటి లెజెండ్స్ తో ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను.

టాలీవుడ్‌ గురించి….
– టాలీవుడ్‌లో చాలా మంచి వాతావరణం కనపడుతుంది. యూనిట్‌లో అందరూ నాకెంతో సపోర్ట్‌ చేసి సెట్‌లో నన్ను కంఫర్ట్‌బుల్‌గా ఉంచారు. అందరికీ ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నాను.

తదుపరి చిత్రాలు..
– ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో కొత్త సినిమాలేవీ చేయడం లేదు. మంచి పాత్రల కోసం వెయిట్‌ చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here