ప్రముఖ హీరో సూర్య హీరోగా, అనుష్క, శృతిహాసన్ హీరోయిన్స్‌గా సూపర్ టేకింగ్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ కె.ఇ. జ్ఞానవేల్‌రాజా, మల్కాపురం శివకుమార్, ధవళ జయంతిలాల్ గాడ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన చిత్రం ‘ఎస్`3’ (యముడు`3). ఈ చిత్రం జనవరి 26న వరల్డ్‌వైడ్‌గా హయ్యస్ట్ స్క్రీన్‌లో భారీగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. అధినేత మల్కాపురం శివకుమార్ సంస్ధ కార్యాయంలో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటుచేసి చిత్ర వివరాలను తెలిపారు.
‘కబాలి’ తర్వాత హయ్యస్ట్ వ్యూస్ వచ్చిన చిత్రం
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ` ‘‘మా సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ద్వారా ‘సింగం`3’ చిత్రాన్ని జనవరి 26న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాంలో రిలీజ్ చేస్తున్నాం. ‘సింగం`1’, ‘సింగం`2’ చిత్రాలను ఆదరించినట్లుగానే ఈ ‘సింగం`3’ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని టీజర్ ద్వారా ఆల్‌రెడీ ప్రూవ్ అయింది. మోషన్ పోస్టర్‌కి సౌత్ ఇండియాలో ‘కబాలి’ తర్వాత ‘సింగం`3’ చిత్రానికి కోటి వ్యూస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే దర్శకుడు హరి ఈ చిత్రాన్ని రూపొందించారు. సూర్య, హరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింగం’, ‘యముడు’ చిత్రాు పెద్ద హిట్ సాధించాయి. ఆ కోవలోనే ఈ చిత్రం కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. గత రెండు చిత్రాకు భిన్నంగా ఆడియన్స్ ఎంజాయ్ చేసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది.అనుష్క నటన, శృతిహాసన్ గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిుస్తుంది. ఇద్దరూ వారి క్యారెక్టర్స్‌కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు. డిఓపి ప్రియాన్ ప్రతి ఫ్రేమ్‌ని అందంగా తీర్చిదిద్దారు. హరి ఎంతో కేర్ తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతని టేకింగ్‌కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా ఈ చిత్రం ఆద్యంతం పరిగెడుతుంది. సూర్య ఎప్పటికప్పుడు కొత్తతరహా క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆడియన్స్‌ని మరోసారి ధ్రిల్ చేయనున్నారు. డిమానిటైజేషన్ వల్ల తమిళనాడులో వచ్చిన సైక్లోన్ వల్ల ఈ సినిమా రిలీజ్ కొంత ఆలస్యమైంది. అంతేకానీ ప్రత్యేకించి కారణం ఏం లేదు. టికెట్ కొన్న ప్రేక్షకుడు ఎంతో కష్టపడి తన విలువైన సమయాన్ని వెచ్చించి సినిమా చూస్తాడు. వారిని సంతృప్తిపరిచేలా ఈ చిత్రం ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. 2017లో మా బ్యానర్ ద్వారా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ ఆడియన్స్ చేతిలో ఉంది. డెఫినెట్‌గా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారు. ఆ నమ్మకం నాకుంది. మూడు నెలల క్రితం ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుతో కొన్నాను. టీజర్ రిలీజ్‌కి ముందే ఈ చిత్రం బిజినెస్ అంతా కంప్లీట్ అయింది. ఆంధ్ర, తెలంగాణలో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు ఎంతో సహకరించి ఫ్యాన్సీ రేటుతో ఈ సినిమా తీసుకున్నారు. వారు అందరూ హ్యాపీగా ఉండేలా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. లాస్ట్ ఇయర్ 2016 సంక్రాంతికి భారీ సినిమాు విడుదలై మంచి సక్సెస్ సాధించాయి. మళ్లీ ఈ 2017 సంక్రాంతికి పెద్ద సినిమాు రిలీజ్ అయి సక్సెస్ సాధించి నిజమైన పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఇదొక మంచి శుభ పరిణామం. ఇలాంటి సక్సెస్‌లు ఇండస్ట్రీకి పెద్ద పండగ. మంచి సినిమాు ఎప్పుడు రిలీజ్ అయినా ప్రేక్షకు ఆదరిస్తారు. మా చిత్రాన్ని కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేయాని కోరుకుంటున్నాను’’ అన్నారు.


