‘అభిషేకం’ సీరియల్‌ 2500 ఎపిసోడ్స్‌ పూర్తవడం గిన్నిస్‌రికార్డ్‌గా భావిస్తున్నాను` – దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు

0
494

రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా, నటుడుగా గిన్నిస్‌బుక్‌ రికార్డ్ హోల్డ‌ర్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి దర్శకుడు అన్న పదానికి నిజమైన అర్ధాన్ని తెలియచెప్పిన దర్శకుడు దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వెండితెర మీద ఎన్నో సంచల‌నాలు సృష్టించి ఎంతో కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రవేశించి ఆరోజుల్లోనే ‘విశ్వామిత్ర’ సీరియల్‌ని నిర్మించి అరుదైన రికార్డ్‌ని సాధించారు. తాజాగా ఆయన నిర్మించిన ‘అభిషేకం’ సీరియల్‌ జనవరి 22 నాటికి 2500 ఎపిసోడ్స్‌ పూర్తి అవుతున్న సందర్భంలో దర్శకరత్న డా॥ దాసరి తన స్వగృహంలో విలేకరుల‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి, రామకృష్ణ ప్రసాద్‌, కొమ్మనాపల్లి గణపతిరావు, రాజేంద్ర, మహేందర్‌, క్రాంతి, జయప్రసాద్‌, తాండవకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు మాట్లాడుతూ ` ‘‘యాభై సంవత్సరాలుగా డైరెక్టర్‌గా వున్న నన్ను ప్రజలు, ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తే ఈ స్ధాయికి వచ్చాను. 150 చిత్రాల‌ దర్శకుడుగా రికార్డ్స్‌ సృష్టిస్తే అందరి ఆశీస్సుల‌తో గిన్నిస్‌బుక్‌ రికార్డ్స్‌లో కూడా చేరాను. అది పెద్ద తెర. ఫస్ట్‌ నుండి నా భార్య పద్మకి టీవీ సీరియల్స్‌ నిర్మించాల‌ని కోరిక. ఆమె కోరికతోనే ‘విశ్వామిత్ర’ సీరియల్‌ని నేషనల్‌ నెట్‌వర్క్‌లో స్టార్ట్‌ చేశాం. దాని తర్వాత సౌత్‌ ఇండియన్‌ టీవీ సీరియల్‌గా మహాభారతం, రామాయణం సీరియల్స్‌ నిర్మించాం. అవి మంచి పేరు తెచ్చాయి. అదేస్ధాయిలో మళ్లీ సీరియల్స్‌ నిర్మించాల‌ని 20 సంవత్సరా తర్వాత పద్మ రచయితకి, డైరెక్టర్స్‌కి ఎంతో మందికి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చింది. ఏదీ కార్యరూపం దాల్చ‌లేదు. రెగ్యుల‌ర్‌గా సీరియల్స్‌ నిర్మించానే ఆమె యాంబిషన్‌ అలాగే ఉండిపోయింది. పద్మ కోరికను నెరవేర్చాల‌నే సంక‌ల్పంతో ‘అభిషేకం’ కథ రెడీ చేశాను. కొమ్మనాపల్లి గణపతిరావు ట్రీట్‌మెంట్‌ రాశాడు. సీరియల్‌ ప్రారంభం అయింది. ఈటివి వాళ్లు సీరియల్‌ చేయడానికి ముందుకొచ్చారు. ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్‌ చేశారు. 2500 ఎపిసోడ్స్‌ ఆడుతుందని మేము ఊహించలేదు. 1000 ఎపిసోడ్స్‌ ఆడితేనే అరుదైన రికార్డ్‌ అనుకున్నాం. కానీ అది 2000 ఎపిసోడ్స్‌ దాటి మూడు వేల‌ వరకు వెళ్తుందని బాపినీడుగారు చెప్పారు. ఒక సీరియల్‌ 2500 ఎపిసోడ్స్‌ దాటడం అనేది ఇండియన్‌ రికార్డ్‌. ఇంకో 500 ఎపిసోడ్స్‌ దాటితే గిన్నిస్‌ రికార్డ్‌ అవుతుంది. ‘అభిషేకం’ 2500 ఎపిసోడ్స్‌ దాటి టీవీ సీరియల్స్‌లోనే వరల్డ్‌ రికార్డ్‌ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్‌ని టీఎస్‌ఆర్‌ కళాపీఠం, ల‌లిత కళా పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 22న పార్క్‌ హయత్‌లో గ్రాండ్‌గా సెల‌బ్రేట్‌ చేయాల‌ని సుబ్బరామిరెడ్డిగారు సంకల్పించారు. ఏ స్వార్ధం లేకుండా కళాకారుల్ని ప్రోత్సహించి ఎన్నో సన్మానాలు, సత్కారాలు చేశారు సుబ్బరామిరెడ్డి. సినిమా పరిశ్రమలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటారు. ఇండస్ట్రీ ఎవరికీ సన్మానాలు ఇంతవరకు చేయలేదు. అలాంటిది గవర్నమెంట్‌ వారు కూడా చేయలేనన్ని సత్కారాలు సుబ్బరామిరెడ్డి గారు చేశారు. మా ‘అభిషేకం’ సీరియల్‌ 2500 ఎపిసోడ్స్‌ పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్‌ని అభినందించడానికి గ్రాండ్‌గా ఫంక్షన్‌ చేస్తున్నందుకు ఆయనకు నా కృతజ్ఞతలు. లిమ్కా బుక్‌లో కూడా ‘అభిషేకం’ టీవీ సీరియల్‌ రికార్డ్‌ సాధించింది. అందుకే పెద్ద మనసుతో ఆయన ఈ ఫంక్షన్‌ని చేస్తున్నారు. ఇంత మంచి సీరియల్‌కి వర్క్‌చేసిన టీమ్‌ అందర్నీ అభినందిస్తున్నాను. గోకులంలో సీత సీరియల్‌ కూడా ఆరోజుకి 500 ఎపిసోడ్స్‌ పూర్తవుతుంది. మేము నిర్మిస్తున్న సీరియల్స్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకుల‌కు కృతజ్ఞతలు’’ అన్నారు.

సాంస్కృతిక కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ` ‘‘సినీ పరిశ్రమలో ఏ లాంగ్వేజ్‌లో అయినా హీరో డామినేషన్‌ ఎక్కువగా ఉంటుంది. దానిని బ్రేక్‌చేసి డైరెక్టర్‌ కూడా ఒక హీరోనే అని చెప్పిన దర్శకుడు కె.వి. రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు నిరూపించారు. ఆ కోవలోనే దాసరిగారు దర్శకుడు అనే పదానికి నిజమైన అర్ధాన్ని చెప్పారు. రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడుగా నిరూపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఏకైక వ్యక్తి దాసరి. ఆయన జీవితంలో ఎన్నో ల‌క్ష్యాల్ని సాధించారు. ఇప్పుడు సమాజంలో బుల్లితెర అనేది చాలా ముఖ్యమైనది. మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా. పద్మగారు ‘విశ్వామిత్ర’ సీరియల్‌ స్టార్ట్‌ చేశారు. ‘అభిషేకం’ సీరియల్‌ 2500 ఎపిసోడ్స్‌ పూర్తవడం ఇదొక మిరకిల్‌. నాకు చిన్నప్పటి నుండి కళలు, న‌టులు అంటే చాలా ఇష్టం. వారిని దైవశక్తి నడిపిస్తుందనే నా నమ్మకం. నేను 14 సినిమాలు నిర్మించాను. తోటి కళాకారుల‌ను సత్కరిస్తే అది చూసి జనం ఆనందపడ్డారు. వారి ఆనందాన్ని చూడానేదే నా కోరిక. అదే నా సీక్రెట్‌. 1975 నుండి 30 సంవత్సరాలుగా ఎంతోమంది నటీనటుల్ని సత్కరించి సన్మానాలు చేశాను. దాసరి, నేను ఇద్దరం నెంబర్‌వన్‌ పొజిషన్‌లో వుండాల‌నుకుంటాం. అలాగే మా పనులు మేము చేస్తూ వచ్చాం. అభిషేకం 2500 ఎపిసోడ్స్‌ పూర్తయిన సందర్భంగా మా ల‌లిత కళా పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 22న పార్క్‌ హయత్‌ హోటల్‌లో గ్రాండ్‌గా ఫంక్షన్‌ చేయబోతున్నాం. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేసి డైరెక్టర్‌కి ఒక రెస్పెక్ట్‌ని క్రియేట్‌ చేశారు దాసరి. ఆర్టిస్టులు అందరూ ఆయన్ని చూసి భయంతో చేస్తారు. అది ఆయన స్పెషాలిటీ. గంభీరంగా కనిపించినా ఆయన చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఆయన ఏది సాధించినా ఒక ప్రత్యేకత ఉంటుంది. మా ఇద్దరి స్నేహం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. మానవ జీవితంలో ఎదుటి మనిషిలో టాలెంట్‌ని గుర్తించి ఎంకరేజ్‌ చేయడమే గొప్ప వ్యక్తిత్వం’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here