సీనియర్ల కి అభినందనలు తెలిపిన సూపర్ స్టార్

0
791

సంక్రాంతికి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు థియేటర్ల లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి 150 వ సినిమాగా ‘ఖైదీ నెంబర్ 150 ‘, బాలయ్య 100 వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే , రెండూ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న సినిమాలే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ వేదికగా తన సీనియర్ హీరోలు అయిన చిరు,బాలయ్య కి తన అభినందనలు తెలిపారు.

‘ఖైదీ నెంబర్ 150 ‘ లో చిరంజీవి గారి స్క్రీన్ ప్రెసెన్స్ అద్భుతమని, సినిమాకి ఆయనే హైలైట్ అని, ఇన్ని రోజులు ఆయన్ని మిస్ అయ్యామని ఆయన రీ ఎంట్రీ ని స్వాగతించారు మహేష్.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి చెప్తూ శాతకర్ణి గా నందమూరి బాలకృష్ణ నటన కి హ్యాట్సాఫ్
తెలుగు సినిమాల్లోనే నిలిచిపోయే పాత్రని బాలయ్య అద్భుతంగా అభినయించారని చెప్తూ 79 రోజుల్లోనే ఇంత భారీ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని దర్శకుడు క్రిష్ ని అభినందించారు

మొన్న ‘కింగ్’ అక్కినేని నాగార్జున సంక్రాంతి సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకోగా, ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ అన్ని సినిమాలనీ అభినందించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here