దటీజ్ కింగ్
విభిన్న కథాOశాలతో చిత్రాలు ఎంచుకునే ‘కింగ్’ అక్కినేని నాగార్జున మరో సారి తన ప్రత్యేకతని చాటుకున్నారు. పోయిన ఏడాది సంక్రాంతి కి నాలుగు సినిమాల మధ్య ‘సోగ్గాడే చిన్ని నాయనా’ గా వచ్చి విజయ బావుటా ఎగరేసి అభిమానులకి ఆనందాన్ని ఇచ్చిన ‘కింగ్’, ఈ సంక్రాంతికి కి తన సినిమా లేకపోయినా మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150 ‘ కి ఆల్ థి బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు

అలాగే నటసింహ నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ కి కూడా తన విషెస్ చెప్పారు

అలాగే ఈ రెండు పెద్ద సినిమాల మధ్య వస్తోన్న మరో సినిమా శర్వానంద్ ‘శతమానం భవతి’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు

తన సినిమా లేకపోయినా సంక్రాంతికి కి వచ్చే అన్ని సినిమాలు విజయం సాధించాలని విషెస్ తెలిపి తాను సినిమాల విషయం లోనే కాదు బయట కూడా తన తోటి హీరోల సినిమాలు బాగా ఆడాలని కోరుకుని తనని ‘కింగ్’ అని ఎందుకు పిలుచుకుంటారో చెప్పకనే చెప్పారు.


