పెళ్ళిచూపులు చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు విజయ్ నటించిన ద్వారక విడుదలకు సిద్ధంగా ఉండగా, అర్జున్ రెడ్డి చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలు కాకుండా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనితో పాటు ఈ కొత్త ఏడాది. దర్శకుడు పరుశురాంతో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవర కొండ. సినిమాకు సంబంధించిన అన్నీ ఫార్మాలిటీస్ పూర్తి కానున్నాయి. ఈ సినిమాను గీతాఆర్ట్స్ అనుబంధ సంస్థ(జి.ఎ2) నిర్మించనుంది. ఇప్పుడు మారుతి, శర్వానంద్ సినిమాలో కూడా జి.ఎ2 నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత ఈ ఏడాదిన రెండు సినిమాలను జి.ఎ2 నిర్మించనుంది. శ్రీరస్తు శుభమస్తు సినిమా సక్సెస్ తర్వాత పరుశురాం దర్శకత్వంలో రానున్న సినిమా కూడా ఇదే.