పెళ్లి విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌

0
502

గ‌త కొద్ది రోజులుగా కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లికి సంబంధించి టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్రేమించిన వ్య‌క్తితో నిశ్చితార్ధం కూడా జ‌రుపుకుంద‌ని, త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లెక్క‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే కాజ‌ల్ చేసుకోబోయే వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యం మొన్న‌టి వ‌ర‌కు స‌స్పెన్స్ ఉండ‌గా, తాజాగా కాజ‌ల్‌.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. చీక‌ట్లో వెలుగుని తీసుకొస్తున్న‌ట్టు బ్లాక్ క‌ల‌ర్‌పై వైట్ హార్ట్ సింబ‌ల్ ఉన్న ఫోటో పోస్ట్ చేసింది.

కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ ద్వారా కాజ‌ల్ త‌న పెళ్లి విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 30న గౌతమ్ కిచ్లు అనే వ్యాపార‌వేత్త‌ని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలిపింది. క‌రోనా మ‌హమ్మారి వ‌ల‌న కొద్ది మంది స‌భ్యుల మ‌ధ్య పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలుపుతూ `ఇన్నేళ్ళ నా ప్రయాణంలో నాకు మ‌ద్ద‌తుగా నిలుస్తూ నాపై ప్రేమ‌ను చూపిస్తున్న మీ అంద‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు` అని కాజ‌ల్ పేర్కొంది. కాగా, ముంబయిలోని ఫేమ‌స్ సెవ‌న్ స్టార్ హోటల్‌లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2ల‌లో న‌టిస్తుంది. వీటితో పాటు మంచు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here