ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్-స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంభినేష‌న్‌లో ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం

0
566

ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం త‌న 26వ చిత్రంగా వ‌కీల్‌సాబ్‌, క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పిరియాడిక‌ల్ డ్రామాగా 27వ చిత్రాన్ని, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 28వ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.. కాగా ప‌వ‌ర్‌స్టార్ బర్త్ డే సందర్భంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తదుప‌రి చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది ఎస్ ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ‌. సైరా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎస్ ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబందించి మిగ‌తా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here