రీ ఎంట్రీ తరువాత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ జెట్ స్పీడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను ఓకే చేస్తున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయ్యింది. ఈ మూవీ తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నారు. తాజాగా పవన్ 28వ సినిమాను పవన్‌కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. పీఎస్‌పీకే 28 పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. బ్లాక్ బ్లాస్టర్ కాంబినేషన్ మళ్లీ వస్తుంది. పవన్ 28వ మూవీ కాన్సెప్ట్ పోస్టర్..ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదు.. అని ట్వీట్ చేసింది.
పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ పోస్టర్ లో స్టైలిష్ బైక్ కనిపిస్తుండగా..దానిపై పెద్ద బాలశిక్ష పుస్తకం, గులాబి పువ్వు..బ్యాక్ డ్రాప్లో సర్దార్ వల్లభభాయి పటేల్, నేతాజి సుభాష్ చంద్రబోస్ చిత్రాలు కనిపిస్తూ దేశభక్తిని స్మృశించలా ఉంది. హరీష్ శంకర్ కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తుంది. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్, హరీష్ శంకర్, దేవిశ్రీప్రసాద్ కాంభినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడం విశేషం. ఈ సారి హరీష్ శంకర్ వినోదం మాత్రమే ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇచ్చే కథాంశాన్ని ఎంచుకున్నాడని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది.



