గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (RX100 ఫేమ్)

0
617
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ( RX100 ఫేమ్) నేడు బాలానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టమని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చూసి నేను స్వతహాగా ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు.

పచ్చదనాన్ని పెంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేశారు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మొక్కను నాటి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరుగుతున్నది అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరోలు రవితేజ; సౌరబ్; కరణ్; హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్; లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here