‘వి’ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ‌స్టిఫికేష‌న్ ఉన్న పాత్ర చేయ‌డం హ్యాపీగా అనిపించింది – హీరో సుధీర్‌బాబు

0
414

నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా రూపొందిన ‘వి’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి – నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ‘వి’ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా హీరో సుధీర్‌బాబు మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

‘వి’ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌డం ఎలా అన్పిస్తోంది?
– ముందుగా ఈ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌నే అనుకున్నాం. కానీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసే ప‌రిస్థితి లేదు. అందుక‌నే ఓటీటీలోనే విడుద‌ల చేస్తున్నాం. ఓటీటీలో సినిమాను విడుద‌ల చేయ‌డం కూడా ప్ల‌స్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ‘వి’ సినిమాను 200 దేశాల్లో సినిమాను విడుదల చేస్తున్నాం.. దీని వ‌ల్ల తొలి రోజునే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్.

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఏమైనా క‌థ‌లు విన్నారా?
– రెండు రోజుల‌కొక క‌థ చొప్పున వింటూ వ‌చ్చాను. అందులో రెండు మూడు క‌థ‌ల‌ను కూడా ఓకే చేశాను. అయితే ఆ వివ‌రాల‌ను నిర్మాణ సంస్థ‌లు ప్ర‌క‌టిస్తేనే బావుంటుంది.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండ‌బోతుంది?
– ‘వి’ సినిమాలో నా పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచే పాత్ర‌. ఇంద్ర‌గంటిగారు క‌థ చెప్ప‌గానే నాకు కూడా ఈ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర బాగా న‌చ్చింది. చాలా మందికి స్పూర్తిదాయ‌కంగా ఉండే ఒక పోలీస్ ఆఫీస‌ర్‌ను అనుకోకుండా ఓ కిల్ల‌ర్ ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు ఆ ఆఫీస‌ర్ ఏం చేస్తాడనేదే సినిమా. నా పాత్ర‌కి జ‌స్టిఫికేష‌న్ఉంటుంది.

యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో ఎక్కువ‌గా న‌టించార‌ని తెలుస్తోంది?
– నా ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఫైట్ మాస్ట‌ర్ ర‌వివ‌ర్మ‌గారు ఆ ఫైట్‌ను చాలా స్పెష‌ల్‌గా డిజైన్ చేశారు. అయితే సినిమాలో యాక్ష‌న్‌, డ్రామాకు మంచి స్పేస్ కుదిరాయి.ఇక యాక్ష‌న్ అంటారా సాధార‌ణంగానే నేనే బాడీని ఫిట్‌గా ఉంచుకుంటాను. దాంతో ఇంద్ర‌గంటిగారు బ్రాడ్‌పిట్ యాక్ట్ చేసిన `ఫైట్ క్ల‌బ్` త‌ర‌హాలో నా బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండాల‌ని చెప్పారు. దాంతో మ‌రిన్ని ఎక్స‌ర్‌సైజులు చేసి బాడీని మ‌రింత ఫ్లెక్సిబుల్‌గా చేసుకున్నాను.

ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత మ‌హేష్‌బాబు రెస్పాన్స్ ఏంటి?
– మ‌హేశ్‌కు యాక్ష‌న్ పార్ట్ బాగా న‌చ్చింది. ఆ విష‌యాన్నే నాకు చెప్పారు. త‌న‌కు ఇంద్ర‌గంటి సినిమా అంటే మంచి ఓపినియ‌న్ ఉంది. ‘సమ్మోహనం’ టైంలోనే ఆ విష‌యాన్ని నాకు చెప్పారు. ‘వి’ సినిమా కోసం త‌ను కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు కూడా చెప్పారు.

నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి పాత్ర‌ల గురించి?
– నివేదా ఇందులో అపూర్వ అనే క్రైమ్ న‌వ‌లా ర‌చ‌యిత పాత్ర‌లో క‌నిపిస్తుంది. మా మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఓ ర‌కంగా చెప్పాలంటే ఇందులో హీరో, హీరోయిన్ మ‌ధ్య కెమిస్ట్రీ కంటే హీరో, విల‌న్ మ‌ధ్య కెమిస్ట్రీ బావుంటుంది. అలాగే అదితిరావు హైద‌రి కూడా చ‌క్క‌టి పెర్ఫామెన్స్ చేసింది. త‌న పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇంద్ర‌గంటిగారు సినిమాల్లో మంచి సంభాష‌ణ‌లుంటాయి. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే మంచి సంభాష‌ణ‌ల‌తో పాటు మంచి యాక్ష‌న్ పార్ట్ కూడా ఉంటుంది.

నానీతో క‌లిసి న‌టించ‌డం ఎలా అనిపించింది?
– నేను, నాని కంఫ‌ర్ట్ యాక్ట‌ర్స్‌, ఇద్ద‌రం కొల‌త‌లు వేసుకుని న‌టించ‌లేదు. ఆర్టిస్ట్‌గా న‌మ్మ‌కం ఉండ‌టంతో నానితో క‌లిసి ఈ సినిమా చేయ‌డానికి యాక్సెప్ట్ చేశాను. ఇద్ద‌రం పోటీ ప‌డ‌టం అన‌డం కంటే మా క్యారెక్ట‌ర్స్ ఇందులో పోటీప‌డ‌తాయ‌ని చెబితే చ‌క్క‌గా ఉంటుంది. ఇక విల‌నిజం విష‌యానికి వ‌స్తే ఒక్కో సినిమాలో ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు నేను బాఘిలో చేసిన విల‌నిజం ఈ సినిమాతో పోల్చితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలో నాని నెగ‌టివ్ షేడ్స్‌కి త‌న యాక్టింగ్‌తో ఓ డిఫ‌రెంట్ లుక్ తీసుకొచ్చాడు.

ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ గురించి?
– ఇంద్రగంటిగారు .. సెట్స్ లో మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. ఆయ‌న సెట్‌లో ఆర్టిస్టులు రిలాక్స్‌డ్‌గా ఉంటారు. కానీ డైరెక్ట‌ర్‌గా టెన్ష‌న్ అంతా ఆయ‌నే తీసుకుంటారు. సినిమా ముందు యూనిట్‌ను ఇంద్రగంటి గారు చాలా ప్రిపేర్ చేస్తారు.. కాబట్టి సెట్స్ కు వచ్చేటప్పటికీ చాలా కాన్ఫిడెంట్ గా వస్తారు.

`పుల్లెల గోపీచంద్‌గారి బ‌యోపిక్‌ కొన్ని కారణాలతో వెనక్కి వెళుతుంది.. డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇది నేను చేయ‌బోయే ప్యాన్ ఇండియా మూవీ. అలాగే మంచి ప్రొడ‌క్ష‌న్ హౌసెస్‌, బడ్జెట్ కుదిరితే వెబ్ సిరీస్‌లు చేయ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేదు. నా ప్రొడ‌క్ష‌న్‌లోనూ వెబ్ సిరీస్‌ల‌ను చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను. నిర్మాత‌గా కూడా జాయింట్ వెంచ‌ర్స్ చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నాను.`

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here