మ‌రో రికార్డ్ సృష్టించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.

0
636
రామ్ పోతినేని యూట్యూబ్ ఛానెల్

ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. రామ్ కి బాలీవుడ్‌లోనూ సూపర్ క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాల‌న్నిఅక్కడ డబ్ అయ్యి యూ ట్యూబ్‌లో విపరీతంగా ఆదరణ పొందుతుంటాయి. దానికి తగ్గట్టుగానే రామ్ పోతినేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ పోతినేనికి 1.7 మిలియన్ ఫాలోవ‌ర్స్ ఉండగా, ట్విట్టర్‌లో 2.2 మిలియన్ కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… ఇటీవ‌ల త‌న యూట్యూబ్ ఛానెల్ కి సంబంధించి ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాడు రామ్ పోతినేని.

రామ్ పోతినేనికి మొదటి నుండీ యూ ట్యూబ్ మీద మంచి పట్టుంది. దానికి తగ్గట్టుగానే అతని సినిమాల పాటలకు మిలియన్ల కొద్ది వ్యూస్ లభిస్తుంటాయి. రామ్ నటించిన ‘నేను శైలజ..` సినిమాలోని ‘ఏం చెప్పను.. నిన్నెలా ఆప‌ను’ పాటకు 121 మిలియన్ వ్యూస్ దక్కగా, అదే సినిమాలోని ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ పాటకు 111 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇదిలా ఉంటే… రామ్ యూట్యూబ్ ఛానెల్ వ‌న్ మిలియన్ సబ్ స్ర్కైబర్స్ మైలురాయిని చేరింది. ఈ సంద‌ర్భంగా ఎ బిగ్ థాంక్స్ టు ద‌ వ‌న్ మిలియ‌న్ సబ్ స్ర్కైబర్స్ అని ట్వీట్ చేశారు రామ్ పోతినేని.

ప్ర‌స్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో` రెడ్` మూవీ చేస్తున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన `రెడ్`టీజర్ ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకుంది. సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here