ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వ్యాధి వలన మన దేశాన్ని కూడా కొన్ని వారాలుగా లాక్ డౌన్ చేయడంతో అన్నిరంగాలు పూర్తిగా మూతబడడంతో ప్రజలు చాలామంది ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు కొందరు ప్రముఖులు కూడా ముందుకు వచ్చి చేయూతనిస్తున్నారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ నుండి ఎందరో ప్రముఖులు ముందుకు వచ్చి సాయమందించగా, నేడు యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కరోనా బాధితుల సహయార్ధం రూ.1.30 కోట్ల విరాళం ప్రకటించారు ఇటువంటి విపత్కర సమయాన్ని మనందరం కలిసి జయించాలని, అలానే ప్రజలను ఆదుకోవడానికి తన టీమ్ తరపున తాను ముందుకొచ్చి ఈ విరాళాన్ని ప్రకటిస్తున్నట్లు విజయ్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేశారు…….!!!
2 Big Important Announcements! ❤️🤗https://t.co/5n1pnJRCae
Full details at https://t.co/AzYE7kSgsJ#TDF #MCF pic.twitter.com/MVzFbdlXzP
— Vijay Deverakonda (@TheDeverakonda) April 26, 2020



