న్యూ ఇయర్ రోజున మూడు డబ్బింగ్ సినిమాల పోరు

0
697

మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానున్న తరుణం లో చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలకి సంబంధించి ప్రచార చిత్రాలని విడుదల చేయాలనే ఆలోచన తో ఉండటం సహజం. అయితే సినిమా ప్రేమికులు కొత్త ఏడాది లో ఎటువంటి సినిమాలు వస్తాయి, కిందటి ఏడాది కన్నా మెరుగ్గా ఉండే చిత్రాలు వస్తే బాగుండు అనే ఆశ తో కూడా ఉండటం మామూలే. ఇప్పటికే నూతన ఏడాది లో ని మొదటి పండుగ సంక్రాంతి కి రెండు పెద్ద సినిమాలు రానున్న విషయం ఖరారైన నేపథ్యం లో జనవరి 1 న, అంటే న్యూ ఇయర్ రోజున ఏదైనా తెలుగు సినిమా విడుదల అవుతుందా అని అనుకుంటే, మూడు డబ్బింగ్ సినిమాలు రానున్నాయి.

పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్న తూటా జనవరి ఒకటి న విడుదల కానుంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం లో మేఘ ఆకాష్ హీరోయిన్. గౌతమ్ మీనన్ ఈ సినిమా కి దర్శకుడు. ఇకపోతే మమ్ముట్టి నటించిన మధుర రాజా అనే చిత్రం కూడా ఒకటో తారీఖున విడుదల కానుంది. ఈ సినిమా మలయాళం లో ఏప్రిల్ లో విడుదల కాగా, మన తెలుగు ప్రేక్షకుల కోసం ఒకటి న విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ రెండు పక్కన పెడితే, రక్షిత్ శెట్టి నటించిన అతడే శ్రీమన్నారాయణ కూడా అదే రోజున విడుదల కానుంది. విశేషం ఏంటి అంటే ఈ సినిమా ని దిల్ రాజు విడుదల చేయనున్నారు. ధనుష్, మమ్ముట్టి లకి ఇంతకు మునుపే తెలుగు లో క్రేజ్ ఉంది కానీ రక్షిత్ కి మాత్రం ఇది తొలి పరీక్ష అని చెప్పుకోవచ్చు.

మరి ఈ మూడు డబ్బింగ్ సినిమాలు లో ఎవరు పైచేయి సాధిస్తారు అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here