లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా `90ml` మిమ్మ‌ల్నిఅల‌రిస్తుంది – చిత్ర ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి

1
1200

యంగ్ హీరో కార్తికేయ, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం` 90ఎంఎల్`. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సంధర్భంగా చిత్ర‌ దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర ఇంట‌ర్వ్యూ..

మీ గురించి?
– మాది నల్గొండ జిల్లా లోని లింగరాజపల్లి అనే చిన్న గ్రామం. అక్కడి నుండి మేము హైదరాబాద్ కి రావడం జరిగింది. నేను పెరిగింది, చదువుకుంది అంతాఉప్పల్ లోనే. ఆ తర్వాత సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో డైరెక్టర్ చంద్ర మహేష్ దగ్గర ఐదు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్ గా, రైటర్ గా పనిచేసిన అనుభవం ఉంది.

ఈ సినిమా చేసే అవకాశం ఎలా వచ్చింది?
– ఆర్ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి నాకు మంచి మిత్రుడు. ఆ మూవీ చిత్రీకరణ సమయం నుండే నాకు కార్తికేయతో పరిచయం ఉంది. ఆ సమయంలోనే నేను ఈ స్క్రిప్ట్ ను కార్తికేయ కు వినిపించడం జరిగింది. ఆతర్వాత ఆర్ఎక్స్100 విడుదలవడం పెద్ద హిట్ అవ్వడం జరిగింది. అలా కార్తికేయ ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయింది.

ఈ 90ఎంఎల్ కథేమిటీ?
– అందరూ ఈ టైటిల్ చూసి ఇది ఓ తాగుబోతుల చిత్రం లేదా ఆల్కహాల్ కి సంబంధించిన చిత్రం అనుకుంటున్నారు కానీ ఇది అలా కాదు. ఖచ్చితంగా మందు తాగాల్సిన అవసరం ఉన్న ఒక మెడికల్ పేషెంట్ కి సంబందించిన కల్పిత కథ. ది కేవలం ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది తప్ప మరేమి కాదు.

ఇలాంటి చిత్రాల వలన మద్యపానం ను ప్రోత్సహించినట్లు అవుతుందేమో?
– ఈ చిత్రంలో హీరోకి ఆరోగ్య రీత్యా ఆల్కహాల్ తప్పనిసరి అని చెప్పడం జరిగింది తప్ప సినిమాలో
ఎక్కడా మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలు లేవు. 90ఎం ఎల్ అనేది ఎంటర్టైన్మెంట్ తో కూడా కంప్లీట్ లవ్ స్టోరీ.

సినిమాలో స్పెషల్ కంటెంట్ ఏముంది?
– జనాలకు కథ పాయింట్ అర్ధంమవ్వాలనే విధంగా ముందుగా క్యారెక్టర్ ని ఎలివేట్ చేశాం. మొదటి పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు అన్ని అంశాలు జనాలకు నచ్చే విధంగా జాగ్రత్తపడ్డాం. సినిమాలో రవి కిషన్ పాత్రను రివీల్ చేయలేదు. ఆ పాత్ర కొంచెం సైకో షేడ్స్ లో ఉంటుంది. అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఆ పాత్ర అందరికి నచ్చుతుంది.

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది?
– ఏ కథ అయినా సరే మార్నింగ్ షో పడగానే టాక్ ను బట్టి ఆడియెన్స్ కి రీచ్ అవుతుంది. అందరికి నచ్చేలా సినిమా చేయడం అన్నిసార్లు కుదరదు. సినిమా నచ్చితేనే ఎవరైనా సరే వచ్చి చూస్తారు. కొన్నిసార్లు యూత్ కి నచ్చేలా సినిమాలు ఉంటాయి. మరికొన్నిసార్లు ఫ్యామిలీకి నచ్చేలా ఉంటాయి. అందరికి నచ్చేలా సినిమా చేయడమంటే కష్టం. మందు సన్నివేశాలు కేవలం హీరో పాత్రవరకే ఉంటాయి. ఎక్కడా కూడా ఎవరిని మందు తాగమని ప్రోత్సహించే సన్నివేశాలు ఉండవు. కేవలం సినిమాలో ఆ పాత్ర మందు తాగకపోతే బ్రతకలేడు అనే కాన్సెప్ట్ తో నడుస్తుంది. చాలా దేశాల్లో మద్యం బ్యాన్ చేసినప్పటికీ లిక్కర్ తాగ‌క‌పోతే బ్రతుకరు అనే వాళ్ళు ఉన్నారు. వారికోసం స్పెషల్ గా ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇచ్చి మందు తాగేందుకు అనుమతులు ఇస్తారు.

కార్తికేయ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
– కార్తీకేయ నటించిన గత చిత్రాలైన గుణ 369, ఆర్ఎక్స్ 100 లలో యాక్షన్, ఎమోషనల్ కోణంలోనే అతన్ని చూపించడం జరిగింది. ఈ మూవీలో వాటితో పాటు కార్తికేయ కామెడీ కూడా చేయడం జరిగింది. కార్తీక్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కార్తికేయ తన క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

ఆర్ఎక్స్100 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బేనర్ లో మళ్ళీ అదే హీరోతో సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి క‌దా?– అవునండీ! దానికి తగ్గట్టుగానే నిర్మాతలకి కథ మీద పూర్తి నమ్మకం ఉండడంతో నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఒక డైరెక్టర్ కథను ఎంతగా ప్రేమిస్తాడో మా నిర్మాతలు కూడా అంతే ప్రేమించి మేకింగ్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా గాని ది బెస్ట్ గా ఉండడానికి ఆ కథకు పూర్తి సహకారం అందిస్తారు. నా ఫస్ట్ సినిమా ఈ బేనర్లో చేయడం హ్యాపీగా ఉంది. ఆర్ఎక్స్ 100 బేనర్లో వస్తోన్న సినిమా కాబట్టి డెఫినెట్ గా ఆ అంచనాలను అందుకుంటుంది.

  • మా సినిమాకు సంబంధించి ఏది రిలీజ్ చేసినా కొత్తగా ఉండాలని చూసుకుంటాం. అలాగే ఇప్పటి వరకూ మేము రిలీజ్ చేసిన పోస్టర్ కానీ, టీజర్ కానీ, పాటలు కానీ ఇలా ప్రతి ఒక్కటి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 2 మిలియన్ కి పైగా డిజిటల్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి. రంగస్థలం తర్వాత చంద్రబోస్ గారు సింగిల్ కార్డు తో రాసిన సినిమా మాదే. అనూప్ రూబెన్స్ గారు ఆరు పాటలకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.

పాటల చిత్రీకరణ కోసం అజర్ బేజాన్ కి వెళ్ళడానికి కారణం?
– కథ పరంగా హీరో హీరోయిన్ల మీద వచ్చే పాటకు డ్రై మౌంటైన్స్ లొకేషన్ కావాల్సి వచ్చి వెతుకుతున్నప్పుడు అజర్ బైజాన్ లో లొకేషన్ నాకు బాగా నచ్చాయి. అలా అజర్ బైజాన్ లో మూడు పాటలు షూట్ చేయడం జరిగింది. ప్రతి పాట చాలా బాగా వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here