‘సీత’ ఈ తరం చాలా మంది అమ్మాయిలకు ప్రతిరూపం లాంటిది – కాజల్ అగర్వాల్

0
711

టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ,కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగాఏ కె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘సీత‘. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూ…

నేటి తరం సీత ఎలా ఉండబోతుంది?
– తను చాలా మోడరేట్. తన డ్రీమ్స్, తన గోల్స్ ను తను ఎలాగైనా సాధించుకోవాలనే పట్టుదలతో ఎంతో ఫోకస్డ్ గా ఉంటుంది. అయితే తన గోల్స్ ను, డ్రీమ్స్ ను సాధించుకునే క్రమంలో తానేం చేసింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండి ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు మొదటిసారి కాబట్టి నేను కూడా ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.

ఈ సినిమాకి ‘సీత’ అని టైటిల్ పెట్టడానికి కారణం ?
– కారణం అంటే.. (నవ్వుతూ) ప్రత్యేకించి కారణం అంటూ ఏమీ లేదు. ఒక విధంగా సీతే’ కారణం. ఎందుకంటే ఈ కథ.. సీత జీవితంలో జరిగిన సంఘటనలు తెలియజేసే క్రమమే. సీత ఈ తరం చాలామంది అమ్మాయిలకు ప్రతిరూపం లాంటిది. తప్పకుండా నేటి తరం యువతులు ఈ క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు.

తేజగారి వర్కింగ్ స్టయిల్ లో ఏమైనా మార్పులు గమనించారా?
– నేను అయితే చాలా మార్పులు గమనించాను. యూనిట్ నుంచి తనకు కావాల్సిన వర్క్ రాబట్టుకోవడం కోసం ఆయన కమాండ్ చేసే విధానం మారింది. అలాగే యాక్షన్, కట్ కి మధ్యలో ఆయన మెడిటేషన్ చేస్తున్నంతగా షాట్ లో లీనం అయిపోతున్నారు. ఇరవై నాలుగు గంటలు పని చెయ్యగలిగేంత హార్డ్ వర్కర్, ఎనర్జీ మెయింటైన్ చేయడం లో. ఆయనకు ఆయనే సాటి. తేజగారితో పని చెయ్యడం వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు చూస్తుంటే మీది కొంచెం నెగిటివ్ రోల్ లా అనిపిస్తోంది ?
– దీని గురించే చాలామంది అడుగుతున్నారు. సినిమా చూస్తే నా క్యారెక్టర్ ఎందుకు అలా ఉందనేది అర్ధమవుతుంది. సినిమా ‘సీత’ పాత్ర చుట్టే తిరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ పాత్ర ఏ స్థాయిలో ఉండాలి. కరెక్ట్ గా ఆ స్థాయిలోనే ‘సీత’ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ప్రకారమే సీత బిహేవ్ చేస్తోంది.

http://industryhit.com/t/2019/05/kajal-agarwal-pics-6/

ఈ సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి చెప్పండి ?
– ఇది నాకు తనతో సెకెండ్ ఫిల్మ్. తన పాత్రలో తాను అద్భుతంగా నటించాడు. ఎందుకంటే తన క్యారెక్టర్ కూడా రెగ్యులర్ గా ఉండదు. ముందుగా ఆ క్యారెక్టరైజేషన్ని అర్ధం చేసుకోవడం.. అందుకు తగ్గట్లు సిచ్యుయేషన్ పరంగా యాక్ట్ చెయ్యడం చాలా కష్టం. నిజంగా శ్రీనివాస్ చాలా బాగా చేశారు. తనతో మళ్లీ కలిసి పని చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది.

ఈ సినిమా షూటింగ్ క్రమంలో హీరోని బాగా టీజ్ చేశారట..?
– అయ్యో (నవ్వుతూ) నేనేం టీజ్ చెయ్యలేదండి.. అయినా డామినేట్ చేశానని అని కూడా అంటున్నారు. అసలు ఇలాంటి రూమర్స్ ఎవరు, ఎలా పుట్టిస్తారు. నేనెప్పుడూ ఎవర్ని టీజ్ చెయ్యలేదండి. కాకపొతే అబ్ జర్వ్ చేస్తాను అంతే కానీ ఎవర్ని టీజ్ చెయ్యను కావాలంటే షూట్ లో తేజగారు ఉన్నారు..ఆయన్ను అడగండి.

ఈ సినిమాలో సోషల్ మెసేజ్ ఏమైనా ఉంటుందా ?
– సోషల్ మెసేజ్ అయితే సినిమాలో టచ్ చెయ్యలేదు. కాకపోతే ప్రతి వ్యక్తికి ఎవరికీ వారికీ పర్సనల్ డెవలప్ మెంట్ కి సంబంధించి మెసేజ్ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ కి సంబంధించి మంచి మెసేజ్ ఉంటుంది.

ఇటు శ్రీనివాస్ లాంటి యంగ్ హీరోస్ తో యాక్ట్ చేస్తున్నారు ? అటు మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోలతో యాక్ట్ చేస్తున్నారు ? ఎలా అనిపిస్తోంది ?
– ఎప్పటిలాగే మామూలుగానే అనిపిస్తోందండీ (నవ్వుతూ). కాకపాతే మెగాస్టార్ గారితో కలిసి పని చేయడం అదొక గ్రేట్ ఫీలింగ్. ఆయనతో కలిసి నటించడం ఒక హానర్ గా ఫీల్ అవుతున్నాను. అలాగే యంగ్ హీరోస్ తో కలిసి చెయ్యడం కూడా మంచి ఎక్స్ పీరియన్స్. ఇద్దరితో కలిసి నటించడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.

ఇండియన్ 2’లో హీరోయిన్ గా నటిస్తున్నారు కదా ?
– ఆ సినిమా ఆగి పోయింది అని రూమర్స్ వస్తున్నాయి. అలాంటిదేం లేదు . కమల్ సర్ కొంచెం బిజీగా ఉండటం వల్ల షూట్ మధ్యలో బ్రేక్ వచ్చింది అంతే. త్వరలోనే ‘ఇండియన్ 2’ షూట్ మళ్లీ మొదలవుతుంది. ఆ సినిమా కోసం నేను కూడా చాలా ఇంట్రస్టింగ్ గానే వెయిట్ చేస్తున్నాను.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?
– శర్వానంద్ హీరోగా ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. అలాగే జయం రవితో చేస్తోన్న మూవీ కూడా షూటింగ్ పూర్తి అయింది. ఇక ‘ఇండియన్ 2’ అలాగే తమిళంలో మరో సినిమా చేస్తున్నాను. తెలుగులో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్ కాజల్ అగర్వాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here