ఈ హిట్ చిత్రాలకు మొదట అనుకున్న పేర్లు ఇవే..

0
440

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కొందరు చెబుతుంటారు.. అలాగే సినిమా మొత్తం తీశాక ముందు అనుకున్న టైటిల్ ఒకటి.. ఆ తర్వాత చివరలో మారిన టైటిల్ మరొకటిలా ఉంటుంది. ఇలా స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ సినిమాల పేర్లు రిలీజ్ డేట్ కు వచ్చేసరికి మారిపోతుంటాయి. అలా మారిన కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం..

*పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేదీ సినిమాకు మొదట దర్శకుడు త్రివిక్రమ్ ‘సరదా’ అనే టైటిల్ ను అనుకున్నాడట.. కానీ కథలోని థీమ్ ను అర్థం చేసుకొని అత్తారింటికి దారేదీగా మార్చేశారు.

* సంచలన దర్శకుడు కొరటాల శివ మొదటి సినిమా మిర్చికి ముందుగా అనుకున్న టైటిల్ వారధి. కానీ ప్రభాస్ మిర్చి పాటలో డ్యాస్స్ చేయడం.. ఆ టైటిల్ సూట్ అవుతుందని ‘మిర్చి’గా మార్చేశారట..

*రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న చిత్రానికి మొదట అనుకున్న పేరు ‘బంతి’. కానీ సినిమా పూర్తయ్యేవరకు సునీల్ క్యారెక్టర్ ను బట్టి ‘మర్యాద రామన్న’గా మారిపోయింది.

*పవన్ నటించిన తీన్ మార్ మూవీకి మొదట ‘ఖుషీగా’ అనే టైటిల్ అనుకున్నారట.. కానీ అది తీన్ మార్ గా కొనసాగింది.

*సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి మూవీకి మొదట అనుకున్న టైటిల్ ‘రచ్చ’. కానీ ఆ తర్వాత మార్చేశారు.

*వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన రాంచరణ్ మూవీ ‘ఎవడు’ మూవీకి మొదటే ‘వాడే’ అనే టైటిల్ అనుకున్నారట..

*నాగచైతన్య హీరోగా సుకుమార్ తీసిన 100% లవ్ చిత్రానికి మొదట దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే టైటిల్ ను అనుకున్నారట.. కానీ చివరకు 100% లవ్ కే ఫిక్స్ అయ్యారు.

*రాంచరణ్ కెరీర్ నే మలుపు తిప్పిన చిత్రం ‘మగధీర’. మొదట ఈ సినిమాకు రాజమౌళి అనుకున్న పేరు ‘డేగ’.

*మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ తొలి బ్లాక్ బస్టర్ ‘ఒక్కడు’. ఈ సినిమాకు ముందు అనుకున్న పేరు అతడే ఒక సైన్యం.

*రాంచరణ్ చిరుత మూవీకి పూరి తొలుత అనుకున్న పేరు ‘కుర్రాడు లోక్లాస్’.

*పవన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీ ఖుషీ సినిమాకు మొదట ‘చెప్పాలని ఉంది’ అనే టైటిల్ అనుకున్నారట..

*యంగ్ హీరో నిఖిల్ సినిమా ‘అర్జున్ సురవరం’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు ముందుగా ‘ముద్ర’ అనే టైటిల్ అనుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here