‘జెర్సీ’ మూవీ ఆడియో రివ్యూ

0
945

సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో  న్యాచురల్ స్టార్ నాని మరియు శ్రద్ద శ్రీనాథ్ జంటగా నిర్మితమై వేసవి విడుదలకు సిద్దమైతున్న ‘జెర్సీ’ చిత్రం తాజాగా పాటలను రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ  తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ‘అజ్ఞాతవాసి’ తరువాత తెలుగు చిత్రానికి పని చేయడం ఈ చిత్రంతోనే జరగటంతో ప్రేక్షకులకు కొంత ఉత్సుకత ఏర్పడింది. ఇకపోతే ఈ చిత్రానికి తెలుగులో పాటలు అన్ని కూడా ప్రముఖ గేయ రచయిత కృష్ణ కాంత్ చేత రాయించటం జరిగింది. ఇతను తాజాగా ‘టాక్సీవాల’ చిత్రంలోని “మాటే వినదుగా” పాటను రాశాడు. ఈ పాట ఎంత పాపులర్ అయ్యుందో మన అందరికి తెలిసిందే. ఇక పాటల విషయానికి వద్దాం..

1. అదేంటోగాని ఉన్నపాటుగా..

అనిరుధ్ ఆలపించిన ఈ పాట వినటానికి కొంచెం కొత్త గాత్రం అనిపిస్తుంది. మూవీలో హీరో నేపద్యంలో హీరొయిన్ కలసిన తరువాత వచ్చే పాటల ఉంది. హీరొయిన్ను తలచుకుంటూ హీరో పాడుకునే ఈ పాట వినసొంపుగా ఉంది.

2. స్పిరిట్ అఫ్ జెర్సీ..

కాల భైరవ పాడిన ఈ గేయం ఈ మూవీకి అసలు మూలంలా ఉంది. కాల భైరవ గాత్రంలో కొంచం బేస్ తగ్గించి పాడాడు. క్రికెట్ నేపద్యంలో జయాపజయాలను తెలియచేస్తూ వచ్చిన ఈ పాట అనిరుధ్ మ్యూజిక్ చాల చక్కగా ఉంది.

3. పదే..పదే..

అనిరుద్, శక్తిశ్రీ గోపాలన్ మరియు బ్రోద ముగ్గురు కలిసి పాడిన ఈ పాట చాల కొత్తగా ఉంది. ఈ పాటలో ఇంగ్లీష్ లిరిక్స్ బ్రోద రచయతనే పాడటం విశేషం. ఈ పాట రొమాంటిక్ నేపద్యంలో వచ్చే గీతంలా  ఉంది. శక్తిశ్రీ వాయిస్ చాల బావుంది.

4. ప్రపంచమే అలా..

షషా తిరుపతి మరియు ఇన్నో గేంగ పాడిన ఈ పాట మెలోడీ సాంగ్. హీరొయిన్ నేపద్యంలో హీరోని తన ప్రపంచంగా బావిస్తూ తానుగా పాడుకుంటున్న పాటలా ఉంది. కొంచం స్లో ….

5. నీడ పడదని…

దర్శన్ రావల్ ఆలపించిన ఈ పాటలోని గాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అనిరుద్ చాలా చక్కని సంగీతం ఇచ్చాడు. హీరో తన జీవితంలోని కష్టాలను గూర్చి వచ్చే సన్నివేశంలో ఈ పాట ప్లే అవుతుంది అని అనిపిస్తుంది.

మొత్తానికి ఈ చిత్రంలోని పాటలు వినటానికి చాల ఆహ్లాదంగా, వినసొంపుగా ఉన్నాయి.

(ఇది కేవలం నా యొక్క అభిప్రాయం మాత్రమే)

-: విజయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here