‘బ్లఫ్‌ మాస్టర్‌’ ట్రైలర్‌ విడుదల

0
517

శ్రీదేవి మూవీస్‌ శివలెంక క ష్ణప్రసాద్‌ సమర్పిస్తున్న చిత్రం ‘బ్లఫ్‌ మాస్టర్‌’. అభిషేక్‌ ఫిలిమ్స్‌ రూపొందిస్తోంది. సత్యదేవ్‌, నందితా శ్వేత, ఆదిత్య మీనన్‌, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్య కృష్ణ, టెంపర్‌ వంశీ, దిల్‌ రమేశ్‌ తదితరులు కీలక పాత్రధారులు. గోపీ గణేష్‌ పట్టాభి. బి.ఎఫ్‌.ఎ దర్శకుడు. రమేష్‌.పి.పిళ్లై నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముంబై నుంచి ట్రైలర్‌ లింక్‌ను రానా ఆన్‌లైన్‌ లో విడుదల చేశారు.ఈ సందర్బంగా….

చిత్ర సమర్పకులు శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లడుతూ – ”సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. డిసెంబర్‌ 28న సినిమాను విడుదల చేస్తాం. చాలా హార్డ్‌ వర్క్‌ చేశాం. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కూడా వచ్చేసింది. సెన్సార్‌ సభ్యులు చాలా మెచ్చుకున్నారు. ప్రస్తుత సమాజానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా. సొసైటీలో బ్లఫ్‌ మాస్టర్లు చాలా ఉంది ఉన్నారు కదా.. వారి వల్ల పలువురు మోసపోతున్నారు. ఆ విషయాలతో దర్శకుడు బాగా తీశారు. ఈ సినిమా తర్వాత అతనికి మంచి ఆఫర్లు వస్తాయి. హీరో కూడా చాలా బాగా చేశారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం నెక్స్ట్‌ లెవల్లో ఉంది. ఇంత వర్సటైల్‌ ఉన్న ఆర్టిస్ట్‌ని తొలి సారి చూశాను. ప్రజల్లో అవేర్‌ నెస్‌ తెచ్చే సినిమా ఇది. ఈ సినిమాలో కొన్ని డైలాగులు పులగం రాశారు” అన్నారు.

దర్శకుడు గోపీగణేష్‌ పట్టాబి మాట్లాడుతూ – ”సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు చాలా అప్రిషియేట్‌ చేశారు. 20 నిమిషాల సినిమా ప థ్వి భుజాల మీద తీసుకెళ్లారు. చాలా కష్టపడ్డాడు. హిల్‌ స్టేషన్స్‌ లో ఎన్నిసార్లు ఎక్కమన్నా ఎక్కడా విసుక్కోకుండా చేశారు. సునీల్‌ కశ్యప్‌ మ్యూజిక్‌ వింటే రెహమాన్‌ సంగీతం చేశారా అని అనిపించింది. చైతూ, సత్య బాగా చేశారు. పులగం స్పెషల్‌ డైలాగులు అందించారు” అన్నారు.

హీరో సత్యదేవ్‌ – ” మోసపోయే వాళ్లు ప్రస్తుతం చాలా మంది అయ్యారు. ఈసినిమాలో మోసపోయే వాళ్లల్లో నేనూ ఒకడిని. ఒక కంపెనీలో 20 మందిని జాయిన్‌ చేస్తే, వాళ్లు మోసపోతారు. ఆ 20 మంది నన్ను పట్టుకుంటారు. అదీ నా పాత్ర. దీన్ని దో నెంబర్‌ బిజినెస్‌ అని అంటారు . మిడిల్‌ క్లాస్‌ వాళ్లను టార్గెట్‌ చేసి, ట్రాప్‌ చేస్తారు ఈ బిజినెస్‌లో గోపీ బాగా తీశారు. శివలెంక కృష్ణప్రసాద్‌ గారు చాలా పెద్ద నిర్మాత. నాలాంటి వాడిని ఎంకరేజ్‌ చేసి, అవకాశాలు ఇవ్వడం చాలా హ్యాపీ. నాతోపాటు చేసిన చైతూ చాలా గొప్ప నటుడు. గొప్ప నటుడని నేను చెప్పడం కాదు. ప్రూవ్‌ అయిన నటుడు” అన్నారు.

సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ – ”నేను సినిమా గురించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. సినిమా చూసి ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడతారు. మా సినిమాకు అందరూ ఇష్టంతో కష్టపడ్డారు” అన్నారు.

ఈ చిత్రానికి కథ: హెచ్‌. వినోద్‌, అడిషనల్‌ డైలాగ్స్‌: పులగం చిన్నారాయణ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, మధురకవి కోగంటి వెంకటాచార్యులు, విశ్వనాథ్‌ కారసాల, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎం.క ష్ణకుమార్‌ (కిట్టు), ఆర్ట్‌: బహ్మ్ర కడలి, ఎడిటర్‌: నవీన్‌ నూలి, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, సంగీతం: సునీల్‌ కాశ్యప్‌, నిర్మాత: రమేష్‌, పి.పిళ్లై, మాటలు- దర్శకత్వం: గోపీగణేష్‌ పట్టాభి బి.ఎఫ్‌.ఎ.

http://industryhit.com/t/2018/12/bluff-master-trailer-launch/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here