” ‘సవ్యసాచి’ లాంటి మంచి సినిమా నాగచైతన్య తో చేయడం చాలా హ్యాపీగా ఉంది ” – నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌ (సి.వి.ఎం) (మైత్రి మూవీ మేకర్స్)

0
376

తెలుగు సినీ రంగం లో శ్రీమంతుడు తో ప్రారంభించి వరసగా జనతా గ్యారేజ్, రంగస్థలం తో హ్యాట్ ట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందించి ఓ బ్రాండ్ సంపాదించుకుంది మైత్రి మూవీ మేకర్స్. తాజాగా యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో లవ్ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సవ్యసాచి`. రెండో హాట్ట్రిక్ కి శ్రీకారం చుడుతూ నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌ (సి.వి.ఎం) ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 2న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలుతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…

* ఎప్పుడూ ప్రెస్ ముందుకు రానివారు ఇప్పుడు ప్రెస్ ముందుకు వ‌చ్చారు?
– అలాంటిదేమీ లేదండీ. మాకు అన్నిటిక‌న్నా క‌ష్ట‌మైన ప‌ని ప్రెస్‌తో మాట్లాడ‌ట‌మే. మిగిలిన వ‌న్నీ కూడా సుల‌భంగా చేస్తాం. ఇలా ప్రెస్ ముందుకు రావ‌డం అల‌వాటు లేదంతే.

* మీలో ఎవ‌రు స‌బ్జెక్ట్ ఓకే చేస్తారు?
– ముగ్గురం క‌లిసి వినం. సెప‌రేట్‌గానే వింటాం. అయినా ముగ్గురం క‌లిసి ఓకే చేస్తాం. స్పెష‌ల్‌గా `ఈ క‌థ వ‌ద్దు.. ఇంకోక‌టి చేయండి` అనేది ఇప్ప‌టిదాకా ఏ ద‌ర్శ‌కుడితోనూ రాలేదు. ఇప్ప‌టిదాకా మా ద‌ర్శ‌కులు చెప్పిన మూడు క‌థ‌లు బావున్నాయి.

* వ‌రుస స‌క్సెస్‌లున్నాయి. కంటిన్యూ గా ఇదే రిజల్ట్ ఉంటుందని భావిస్తున్నారా?
– దీనికి సమాధానం ఎవరు చెప్పలేరు మేము తీసే సినిమాలను చూసి ఆదరించే ప్రేక్షక దేవుళ్ళే నిర్ణయిస్తారు. సినిమా రంగం పై మాకున్న అనుభవం తో డైరెక్టర్ చెప్పే కథ ఏ హీరోకు బాగుంటుందో… మేము కలిసి తీసుకునే నిర్ణయాలు సరైనవి అనే పూర్తి నమ్మకంతోనే ప్రాజెక్టులు చేస్తాం సక్సెస్లు ప్లాప్ లు అనేవి మా చేతుల్లో వుండవు కదా? కానీ అన్ని సినిమాలు సక్సెస్ కావాలనే నిర్మిస్తాం.

* చందుమొండేటి ఈ స‌బ్జెక్ట్ ఎప్పుడు చెప్పారు?
– న‌వంబ‌ర్‌లో షూటింగ్ మొద‌లుపెట్టాం. అంత‌కు రెండు నెల‌ల ముందు చెప్పారు. అంటే లాస్ట్ సెప్టెంబ‌ర్‌లో చెప్పారు. ప్రేమమ్ సినిమా షూటింగ్ టైం లోనే ఈ క‌థ‌తో హీరోగారు, చందుగారు ఎప్ప‌టి నుంచో ట్రావెల్ అయ్యారు.

* నాగచైతన్య తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ?
-చాలా హ్యాపీగా ఉందండి, ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇంత మంచి సినిమా చైతన్య తో చేయడం చాలా హ్యాపీ.

*’మైత్రి’ బ్యానర్ లో మళ్ళి మళ్ళీ చేయాలనుంది చైతన్య అన్నారు కదా
-మాకు కూడా చైతన్య తో మంచి ప్రేమ కథా చిత్రం తీయాలని ఉంది.

* మీ ముగ్గురిలో ఎవ‌రికైనా సినిమా నిర్మాణ అనుభ‌వం ఇంత‌కు ముందు ఏమైనా ఉందా?
– అంద‌రికీ ఇంత‌కు ముందు చూసిన అనుభ‌వ‌మే అండీ. ర‌వికి కాస్త ఎక్కువ బెట‌ర్‌. మేం అంద‌రం విజ‌య‌వాడ నుంచే. అక్క‌డ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎప్పుడూ సినిమానే. విజ‌య‌వాడ‌లో అంద‌రూ సేమ్ బ్యాచ్‌. పాతికేళ్లుగా ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ తరువాత ఓవర్ సీస్ బిజినెస్ స్టార్ట్ చేసాము.

* మాధ‌వ‌న్‌గారిని మీరు అప్రోచ్ అయ్యారా?
– మేం క‌లిసి క‌థ చెప్ప‌గానే ఆయ‌న‌కు న‌చ్చి చేస్తాన‌న్నారు. ఆయ‌న న‌టించిన చాలా సినిమాలు డ‌బ్బింగ్ అయి ఇక్క‌డ బాగా ఆడాయి. దాంతో ఆయ‌న‌కు తెలుగులో ఓ సినిమా చేయాల‌ని అనిపించింది. ఈ క‌థ న‌చ్చి చేశారు.

* మాధ‌వ‌న్‌గారు ఈ రోల్‌కి ఏదైనా స్పెష‌ల్ హోమ్ వ‌ర్క్ చేశారా?
– ఆయ‌న‌కు అలాంటివేమీ అక్క‌ర్లేదండీ. ఆయ‌న ఆన్‌సెట్‌లో ఇంప్రూవైజ్ చేసేవారు.

* ఇందులో మీకు బాగా న‌చ్చిన అంశం ఏంటి?
– ఇందులో ఉన్న సిండ్రోమ్ మాకు ఇంట్ర‌స్టింగ్గా అనిపించింది. ఆ చెయ్యి వేరుగా బిహేవ్ చేయ‌డం అనేది చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యం. అంతేగానీ ఒన్లీ యాక్ష‌న్ కాన్సెప్ట్ తో చూడ‌కూడ‌దు. దీన్లో కామెడీ ఉంది. డ్రామా ఉంది. ఫ‌స్ట్ ఆఫ్ పూర్తిగా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది.

* హీరో, ద‌ర్శ‌కుల మాట‌ల‌ను బ‌ట్టి… మీ సంస్థ యాడ్ కావ‌డం వ‌ల్ల‌నే బ‌డ్జెట్ భారీగా అయింద‌న్న‌ట్టు అన్నారు… నిజ‌మేనా?
– అలాంటిదేమీ లేదండీ. కంఫ‌ర్ట‌బుల్‌గానే ఉన్నాం. కావాల్సినంతే ఖ‌ర్చుపెట్టాం.

* ముందు స్పెష‌ల్ సాంగ్‌కి త‌మ‌న్నాను అనుకుని, త‌ర్వాత డ్రాప్ అయిన‌ట్టున్నారు?
– అంటే ఎంత ఆలోచించినా, ఆ సాంగ్‌లో త‌మ‌న్నాను పెడితే సైడ్ ట్రాక్ గా అవుతుంది కధనం లింక్ తెగిన ఫీల్ కలుగుతుంది అది అంతగా ఫిట్ కాద‌ని ద‌ర్శ‌కుడు చెప్పారు. దాంతో వెన‌క్కి త‌గ్గాం అంతే.

* త్రివిక్ర‌మ్‌గారితో సినిమా ఎందుకు ఆల‌స్య‌మ‌వుతుంది?
– అలాంటిదేమీ లేదండీ. కథను తయారు చేస్తున్నారు.

* మీ సంస్థ‌లో ఒక‌సారి ప‌నిచేసిన వాళ్లు మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తున్నారు. స్పెష‌ల్ రీజ‌న్స్ ఉన్నాయా?
– మేం వాళ్ల‌తో హ్యాపీ. వాళ్లు మాతో హ్యాపీ అంతే. చందుతోనూ మళ్ళి రానున్న సినిమాల్లో ఏదో ఒక‌టి మా సంస్థ‌లోనే ఉంటుంది.

* సాయిధ‌ర‌మ్‌తోనూ, ఆయ‌న త‌మ్ముడితోనూ ఒకేసారి తీస్తున్నారు?
– సాయితో చాలా రోజులుగా అనుకుంటున్నాం. ఇప్పుడు సెట్ అయింది. వైష్ణ‌వ్‌తో బుచ్చిబాబు అని రంగ‌స్థ‌లం రైట‌ర్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ లాస్ట్ వీక్‌లో ఉంటుంది. సుకుమార్‌గారితో ఎప్ప‌టి నుంచో ఉంది.

* ఇంకా 14 సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్న‌ట్టున్నాయి?
– లైన్ ఓకె వాటిలో షూటింగ్లో ఉన్న‌వి ఎన్నండీ? ఈ సినిమా రేపు రిలీజ్ ఆ తరువాత అమర్ అక్బర్ అంథోనీ.. షూటింగ్ లో డియ‌ర్ కామ్రేడ్‌ ఆ తరువాత స్టార్ట్ అయితే చిత్ర‌ల‌హ‌రి. ఎనీ టైమ్ రెండు, మూడు క‌న్నా ఎక్కువ సెట్స్ మీద వుండవు ఆ విధంగానే మేము ప్లాన్ చేస్తున్నాము.

* మీలో ఎవ‌రు ఎక్కువ‌గా ప్రొడ‌క్ష‌న్‌ చూసుకుంటారు?
– ర‌విగారు మాత్రం ఎప్పుడూ ఇక్క‌డే ఉంటారు. మిగిలిన ఇద్ద‌రం ఆరు నెల‌లు ఉంటాం. సీఈఓ చెర్రీగారు ఉండనే వున్నారు ఆపై మాకు వండ‌ర్‌ఫుల్ టీమ్ కూడా ఉంది.

* ఓవ‌ర్సీస్‌లో మీరు ఒక‌ప్పుడు బిగ్ ప్లేయ‌ర్స్ క‌దా అది వదిలేసినట్టేనా ?
– అక్క‌డేం చేయ‌ట్లేదండీ. ఇప్పుడు అక్క‌డ గ్రేట్ ఇండియా వాళ్లు.. మిగిలిన వాళ్లు చేస్తున్నారు. అక్క‌డ బిజినెస్ చేయాలంటే క‌నీసం రెండు మూడు వారాలు అక్కడే ఉండాలి. కానీ ఇక్క‌డ ఇన్ని సినిమాలు ప్లాన్ చేసుకుని అక్క‌డ డిస్ట్రిబ్యూష‌న్ చేద్దామంటే క‌ష్ట‌మ‌వుతోంది.

* సుకుమార్‌గారి సినిమా ఎప్పుడుంటుంది?
– ఏప్రిల్‌, మేలో ఉంటుంది.

* నానితో నెక్స్ట్ ఏమైనా ఉంటుందా?
– ఉందండీ.

* సంతోష్ శ్రీన్ వాస్ సినిమా ఎప్ప‌టి నుంచి ఉంటుంది?
– న‌వంబ‌ర్ నుంచి ఉంటుంది. తెరిలో చిన్న పార్ట్ మాత్రమే ఉంటుంది. మిగిలింది అంతా తన సొంత కథే.

* లో బడ్జెట్ మూవీస్ తీసే ఆలోచన ఉందా ?
– స్టార్స్ తో తీసాం ఇక పై తీస్తాము ఇప్పుడు సెకండ్ లెవల్ మూవీస్ తీసాము. మీరు అడిగినట్లు ఆ ప్లానింగ్ కూడా వుంది అంద‌రూ ఫ్రెష‌ర్ల‌తో చేస్తున్నాం. రితీష్ అనే డైరెక్టర్ తో ఇంకో 10 రోజుల్లో షూటింగ్ ఉంటుంది. రూ.89ల‌క్ష‌ల‌ బడ్జెట్ అడిగాడు మేము కోటి రూపాయలు కేటాయించాము. ఇంకో 10 రోజుల్లో షూటింగ్ ఉంటుంది.

* స్టార్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి, స్మాల్ సినిమాలు చేయ‌డానికి ఏమైనా తేడా ఉందా?
– దేని బ‌డ్జెట్ దానికి ఉంటుంది. స్టార్ల సినిమాల్లో ఐదారు రోజుల్లో మంచి హిట్‌లో రిక‌వ‌ర్ అయితే, ఇందులో 10 రోజుల్లో అవుతుంది.

* సవ్య‌సాచిని త‌మిళ్‌లో విడుద‌ల చేస్తున్నారా?
– మాధ‌వ‌న్‌గారు అక్క‌డ పెద్ద హీరో కాబ‌ట్టి, అక్క‌డ త‌మిళ్‌లో విడుద‌ల చేయకూడనుకున్నాము డైరెక్ట్ గా తెలుగు విడుదల చేస్తున్నాము.

* నెక్స్ట్ ఇయ‌ర్ ఐదు సినిమాలున్నాయా?
– ఈ ఇయ‌ర్ షూటింగ్ స్టార్ట్ అయినవి కూడా నెక్స్ట్ ఇయ‌ర్‌కి వ‌స్తుంటాయి. కంటిన్యూయగా రెండు సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి.

* మీ సొంత స్టూడియో… వంటి వాటిని గురించి ఆలోచిస్తున్నారా?
– మేము పరిశ్రమలో ఇంకా యంగ్ ఏజ్ లో వున్నాము ప్ర‌స్తుతానికి అలాంటి ఆలోచ‌న‌లు లేవండీ.

* మైత్రీకి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌లో ఓ బ్రాండ్ ఉందికదా మిగిలిన సంస్థ‌ల‌తో టై అప్ అవ్వ‌డానికి కార‌ణం ఏంటి?
– సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి, శ్రీ వెంకటేశ్వర లాంటి పెద్ద సంస్థలే సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తున్నారు . మేము కూడా క‌లిసి చేద్దామ‌ని అనుకున్నాం.

* ఎన్టీఆర్‌తో మ‌ర‌లా ఎప్పుడుంటుందండీ?
– రాజ‌మౌళిగారి సినిమా అయ్యాక ఉంటుంది.

* టీవీ రంగంలో రావ‌డానికి అవ‌కాశం ఉందా?
– ఇంకా లేదండీ. గ‌తంలో ఎప్పుడో అమేజాన్ వారు అడిగారు. దాని మీద కూడా మా వాళ్లు ప‌నిచేస్తూ ఉన్నారు.

http://industryhit.com/t/2018/10/savyasachi-producers-interview-photos/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here