ఈ మధ్య చిన్న చిత్రాలు మంచి విజయం సాధిస్తున్నాయి. ఆ కోవలోనే ‘అనగనగా ఓ ప్రేమకథ’ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పటి నుండే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. యూత్ ఫుల్ డైలాగ్స్ తో, కలర్ ఫుల్ విజువల్స్ తో ఉన్న ట్రైలర్ విడుదలయ్యాక సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్ హీరో గోపీచంద్ విడుదల చేసిన ట్రైలర్ కి అన్ని వర్గాల నుండి మంచి స్పందన వచ్చింది. వినూత్నమైన పబ్లిసిటీ కూడా ఈ చిత్రాన్నిప్రేక్షకులకి దగ్గిర చేసింది. హీరో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా, మరో ప్రముఖ హీరో రానా టీజర్ రిలీజ్ చేశారు. మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖర్ కమ్ముల, పరశురామ్ వంటి ప్రముఖ దర్శకులు విడుదల చేసిన సాంగ్స్ కూడా బాగుండడంతో సినిమా మీద మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు గతంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రవితేజ హీరో గా ‘అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి వంటి బ్లాక్ బస్టర్ నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరొందారు. నవంబర్ లో నే ‘అనగనగా ఓ ప్రేమకథ’ ని విడుదల చేయడానికి నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

అశ్విన్ విరాజ్, రిద్ధి కుమార్ లు హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రానికి ప్రతాప్ దర్శకత్వం వహించగా, కె సి అంజన్ సంగీతాన్ని సమకూర్చారు.