వరుణ్ తేజ్, అదితి రావు హైదరి , లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న ‘అంతరిక్షం 9000 KMPH ‘ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. ఈ విషయాన్నీ సినిమా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ లో తెలియజేశారు.. షూటింగ్ స్పాట్ లో ని ఓ ఫోటో ని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అమేజింగ్ గా అనిపించింది అని వెల్లడించారు.. మొదటి సినిమా ‘ ఘాజి’ తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా హై లెవెల్లో ప్లాన్ చేశారు.. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా , ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరిగాయి.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. డిసెంబర్ 21 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుండగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది.. తెలుగులో పూర్తిస్థాయి ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే.