ఇంగ్లీష్ సినిమాల ప్రభావం ఉన్నా , కల్చర్, ఎమోషన్స్ పరంగా తెలుగు సినిమా మేకర్ నే – గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క

0
487

అడివిశేష్‌, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో.. శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడిగా.. అభిషేక్ నామ‌, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించిన చిత్రం `గూఢ‌చారి`. ఆగ‌స్ట్ 3న సినిమా విడుద‌లై మంచి పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీసు వద్ద కూడా మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్తుంది. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క పాత్రికేయుల‌తో మాట్లాడుతూ…

* చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మెచ్చుకుంటార‌నుకున్నాం కానీ, పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతార‌ని అనుకోలేదు.

* ఇంగ్లీష్ సినిమాల ప్ర‌భావం ఉంది. కార‌ణం మా టీం అంతా  చిన్న‌ప్ప‌ట్నుంచి ఇంగ్లీష్ సినిమాలు చూశాం. అలాగ‌ని తెలుగు సినిమాలు చూడ‌లేద‌ని కాదు. చూస్తూనే ఉంటాం. స‌డెన్‌గా ఓ హాలీవుడ్ స్క్రిప్ట్ ఇచ్చి సినిమా చేయ‌మంటే చేయ‌లేను. ఎందుకంటే క‌ల్చ‌ర్ ప్ర‌కారం నేను తెలుగువాడిని. నేను ఎప్పటికీ ఎమోషన్స్ పరంగా తెలుగు సినిమా మేకర్ నే.

* రిజ‌ల్ట్ గురించి ఆలోచించ‌లేదు. మంచి సినిమా తీయాల‌ని చేశాం. ఓ మొండి ధైర్యంతో ముందుకెళ్లిపోయాను.

* శేఖ‌ర్ క‌మ్ముల‌గారి ద‌గ్గ‌ర లీడ‌ర్ సినిమాకు ప‌నిచేశాను. నా మీద శేఖర్ గారి ప్రభావం కూడా చాలా ఉంది నేను, శేష్ క‌లిసి రాయ‌డం వ‌ల్ల‌.. యాక్ష‌న్ సినిమా చేశాం. ఈ సినిమా చేయ‌డానికి ముందు యాక్ష‌న్ సీన్స్ ఎలా చేయాల‌ని తెలుసుకుని  తీశాం.

* శేష్‌లేకుండా నేను సినిమా తీసుంటే ఓ డ్రామా , రొమ్ కామ్ మూవీనో చేసేవాడిని. గూఢ‌చారి లాంటి యాక్ష‌న్ సినిమా చేయ‌లేక‌పోయేవాడిని. ఎందుకంటే నాకు గొడ‌వ‌లంటే ఇష్టం ఉండ‌దు.

*నాకు శేష్  దాదాపు ఎనిమిది సంవత్సరాలు నుంచి తెలుసు. తను నన్ను బాగా నమ్మాడు. మేం చాలా సార్లు సినిమా చేద్దామనుకున్నాం. కానీ నా కథలు తనకు నచ్చేవి కాదు, తను చెప్పిన కథలు నాకు నచ్చేవి కాదు. అంటే ఏదోకటి చేసెయ్యడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. అందుకే లేట్ అయింది. చివరికి గూఢచారితో మీ ముందుకు వచ్చాం.

* మ‌నం చిన్న‌ప్పుడు తిన్న స్వీటు రుచిని మ‌నం మ‌ర‌చిపోయుంటాం. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత తింటే మ‌న‌కు ఆ రుచి ఇంకా బాగుంటుంద‌నిపిస్తుంది. అలా స్పై సినిమాలు వ‌చ్చిచాలా కాల‌మైంది. అంత గ్యాప్ రావ‌డం కూడా మాకు మంచిదే అయింది. అప్ప‌ట్లో కృష్ణ‌గారు, చిరంజీవిగారు చేసిన స్పై మూవీస్ అప్ప‌టి టెక్నాల‌జీకి త‌గ్గ‌ట్టు అప్‌డేటెడ్‌గా ఉంటాయి. ఇప్పటి విష‌యానికి వ‌స్తే ఇది డిజిటిల్ యుగం. దీనికి త‌గ్గ‌ట్టు సినిమా చేయాలి. ఇప్ప‌టి టెక్నాల‌జీ ప్ర‌కారం సినిమానే చేయాలి.

* సుప్రియ‌గారిని ఈ సినిమాలో న‌టింప చేయాల‌నేది అడివిశేష్ ఆలోచ‌నే. త‌న‌కు సుప్రియ మంచి ఫ్రెండ్‌. నాకు ఆమె ముఖ ప‌రిచ‌య‌మే. రా ఆఫీస‌ర్ రోల్‌కి సుప్రియ‌ గారైతే సూట్ అవుతార‌నిపించింది. అన్న‌పూర్ణ స్టూడియో మూవీ మేకింగ్‌లో క‌మాండింగ్‌గా ఉండే సుప్రియగారు అంతే క‌మాండింగ్‌గా క‌న‌ప‌డితే బావుంటుంద‌నిపించింది. ముందు ఆవిడ న‌టించ‌డానికి ఒప్పుకోలేదు. అడ‌గ్గ అడ‌గ్గా.. స‌రే ఆడిష‌న్ చేద్దామ‌ని అన్నారు. చేసిన త‌ర్వాత కూడా ఆమె చేద్దామా వ‌ద్దా? అనే ఆలోచ‌న‌లోనే ఉండిపోయారు. మొద‌టిరోజు షూటింగ్‌కి వ‌చ్చిన ఆవిడ.. `నేను స‌రిగ్గా చేయ‌క‌పోతే బ్యాక్ అప్ పెట్టుక‌న్నారు క‌దా` అన్నారు. ఏం కాదు మీరు చేయండి అని మేం ఆమెను ఒప్పించాం.

* గూఢ‌చారి సీక్వెల్ చేస్తే బావుంటుంద‌ని శేష్ కూడా అన్నారు. ఇలాంటి సిరీస్‌లో ఎన్ని క‌థ‌లైనా చేసుకోవ‌చ్చు. శేష్ కూడా వేరే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నేను బ‌య‌ట సినిమా చేసిన త‌ర్వాత ఈ సీక్వెల్ గురించి ఆలోచిస్తాం.

* ప్ర‌స్తుతం ఏ సినిమా చేయ‌డం లేదు. ఒక స్క్రిప్ట్ రాయటానికే సంవత్సరం పడుతుంది. నా మైండ్‌లో క‌థ‌లకు సంబంధించిన ఐడియాలున్నాయి. పూర్తిస్థాయి క‌థ‌లు ప్రిపేర్ చేయ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here