అన్న‌పూర్ణ నుండి `చి.ల‌.సౌ` సినిమాను విడుద‌ల చేయ‌డం గ‌ర్వంగా ఉంది – కింగ్ నాగార్జున అక్కినేని

0
369

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘చి||ల||సౌ’. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా నాగార్జున అక్కినేని బుధ‌వారం పాత్రికేయుల‌తో మాట్లాడుతూ…

చైతన్య నన్ను ‘చి..ల..సౌ’ సినిమా బాగుంది చూడమన్నాడు. ఏముంటుందిలే అని నెగెటివ్ ఫీలింగ్ తో సినిమా చూశా. సినిమా స్టార్ట్ అయినా 5 నిముషాలకే స్టోరీ కి కనెక్ట్ అయిపోయా. సినిమా చాలా బాగుంది. సుశాంత్ కి ఇది పర్ఫెక్ట్ ఫిలిం. బాగా చేశాడు. రాహుల్ డైరెక్ట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పెర్ఫార్మన్సెస్ అన్నీ బాగున్నాయి. సినిమా బాగా నచ్చి ‘అన్నపూర్ణ’ బ్యానర్ లో చేస్తున్నాము. సుశాంత్ మా ఫామిలీ మెంబెర్ కనుక సపోర్ట్ చేద్దామని నేను ఈ ఫిలిం కి ప్రొడ్యూసర్ గా జాయిన్ అవలేదు. ఒక మంచి సినిమాలో నేనూ ఒక భాగం అవ్వాలని అన్నపూర్ణ బ్యానర్ లో చేశాము. ‘చి..ల..సౌ’ లాంటి సినిమాని విడుదల చేయడం చాలా గర్వంగా ఉంది. తప్పకుండా అన్నపూర్ణ బ్యానర్ లో  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాను. ‘చి..ల..సౌ’ చాలా మంచి సినిమా. అందరి ఆదరణా పొందుతుందని నా నమ్మకం. ‘మహానటి’ , ‘రంగస్థలం’ లాంటి మంచి సినిమాలు రైటింగ్ వలన బాగా ఆడాయి. అలా ‘చి..ల..సౌ’ కూడా రైటింగ్ చాలా బాగుంది. హీరోయిన్ రుహాని బాగా చేసింది. కంటెంట్ బాగుంది మంచి సినిమా చేయగలమన్న నమ్మకం ఉన్న న్యూ టాలెంట్ తో అన్నపూర్ణ బ్యానర్ చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది అనడానికి నాంది ‘చి..ల..సౌ’

‘దేవ దాస్’ గురించి…

‘దేవ దాస్’ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్ ఫిలిం. చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నాను. నాని తో కలిసి చేయడం హ్యాపీగా ఉంది. నాని అచ్చ తెలుగు మాట్లాడుతుంటే బాగుంటుంది. అశ్వినిదత్ గారితో చేస్తున్న మరో మంచి సినిమా. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చాలా బాగా తీస్తున్నాడు. ఈ సినిమా విషయంలో నేను ఫుల్ హ్యాపీ.

‘బ్రహ్మాస్త్ర’ గురించి…

డ్రీమ్ కాంబినేషన్ లో డ్రీమ్ రోల్ చేస్తున్న కరణ్ జోహార్ ‘బ్రహ్మాస్త్ర’ నెక్స్ట్ షెడ్యూల్ ఇండియా లోనే ఉంటుంది. ఇందులో నా రోల్ ఎంతో నచ్చి అంగీకరించాను. త్వరలో ఒక తమిళ్ సినిమా చేయబోతున్నాను. ఒక వారంలో డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here