మాస్‌ మహరాజా రవితేజ హీరోగా, మాళవిక శర్మ హీరోయిన్‌గా సాయిరిషిక సమర్పణలో ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో రజని తాళ్ళూరి నిర్మించిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఈ చిత్రానికి అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పటికే పాటలకు, ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. రవితేజకి మాస్‌ ప్రేక్షకుల్లో వున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. సెన్సార్‌ రిపోర్ట్‌ సైతం పాజిటివ్‌గా వుండటంతో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొని వున్నాయి. ఈ చిత్రం మే 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా మే 24న హైదరాబాద్‌ జూబ్లీ రిడ్జ్‌ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కురసాల, నిర్మాత రామ్‌ తాళ్ళూరి, హీరోయిన్‌ మాళవిక శర్మ పాల్గొన్నారు.

యువ నిర్మాత రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ – ”రవితేజగారి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ‘నేల టిక్కెట్టు’ చిత్రాన్ని నిర్మించాం. మా సినిమాకి స్టార్టింగ్‌ నుండి ఇప్పటివరకు సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. అందుకే ఈ ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశాం. ఫైనల్‌గా రేపు సినిమా రిలీజ్‌ అవుతోంది. ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నచ్చేవిధంగా ఈ చిత్రం వుంటుంది. మాస్‌, క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తారు. రవితేజగారి కోపరేషన్‌ వల్ల ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయగలిగాం. అలాగే మా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఫెంటాస్టిక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మళ్లీ ఆయన దర్శకత్వంలో సినిమా చెయ్యాలని వుంది. అలాగే రవితేజగారితో మరో రెండు ప్రాజెక్ట్‌లు ప్లాన్‌ చేస్తున్నాం. మా కాంబినేషన్‌లో వస్తోన్న ‘నేల టిక్కెట్టు’ చిత్రం ప్రతి ఒక్కర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. మా చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి పవన్‌కళ్యాణ్‌ రావడం చాలా సంతోషంగా వుంది. రెండు సంవత్సరాలుగా ఆయనతో మంచి అనుబంధం వుంది. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే మా ఫంక్షన్‌కి విచ్చేసి బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. త్వరలో పవన్‌కళ్యాణ్‌గారితో కూడా సినిమా తియ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కురసాల మాట్లాడుతూ – ”వన్‌ ఇయర్‌ నుండి ఈ సినిమాకి చాలా హార్డ్‌వర్క్‌ చేశాం. ఫైనల్‌గా రేపు సినిమా రిలీజ్‌ అవుతోంది. చాలా ఎగ్జైటింగ్‌గా వుంది. చాలా కాన్ఫిడెంట్‌గా సినిమాకి వర్క్‌ చేశాం. మంచి ఔట్‌పుట్‌ వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్‌ సీన్స్‌ బాగా ఆకట్టుకుంటుంది. ‘నేల టిక్కెట్టు’ రేంజ్‌ వున్న హీరో ఎదుటపడిన ప్రతి ఒక్కరితో రిలేషన్‌ ఏర్పరచుకుంటాడు. ఆవారాగా తిరిగే ఓ వ్యక్తి ఒక ఫ్యామిలీని ఎలా సంపాదించుకున్నాడు అనేది హీరో క్యారెక్టరైజేషన్‌. సబ్జెక్ట్‌ యాప్ట్‌ టైటిల్‌ ఇది. క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది” అన్నారు.

హీరోయిన్‌ మాళవిక శర్మ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో మెడికల్‌ స్టూడెంట్‌గా నటించాను. వెరీ కాన్ఫిడెంట్‌ అండ్‌ టామ్‌ బాయ్‌ గర్ల్‌. ఈ క్యారెక్టర్‌ చాలా ఇన్‌స్పైర్‌ అయి చేశాను. రేపు సినిమా రిలీజ్‌. చాలా ఎగ్జైటింగ్‌గా వుంది. ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. రవితేజ వెరీ కంఫర్టబుల్‌ కోస్టార్‌. కళ్యాణ్‌ కృష్ణ వెరీ పాజిటివ్‌ పర్సన్‌. తనకేం కావాలో క్లియర్‌గా తెలుసు. రామ్‌ తాళ్ళూరి వెరీ ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ సినిమా తీశారు. సినిమా అంతా చాలా కలర్‌ఫుల్‌గా వుంటుంది. ఓసారి ట్రై చెయ్‌, టైటిల్‌ సాంగ్‌ నాకు బాగా ఇష్టం” అన్నారు.