వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న‌ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్రశంస‌ల్ని అందుకున్న సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ అధినేత‌లు రామ్ ఆచంట‌, గోపీ ఆచంట సంయుక్తంగా 14 రీల్స్ ప్ల‌స్ అనే నూత‌న సంస్థ ద్వారా ప్రొడ‌క్ష‌న్ నెం. 1 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఈ కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు చిత్ర‌బృందం త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నుంది.