`మ‌న‌సుకు న‌చ్చింది` ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ విడుద‌ల చేసిన సూప‌ర్ స్టార్ కృష్ణ‌

0
346

సందీప్‌కిష‌న్‌, అమైరా ద‌స్తుర్‌, త్రిదా చౌద‌రి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `మ‌న‌సుకు న‌చ్చింది`. ఆనంది ఇందిరా ప్రొడ‌క్ష‌న్ ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై ఘ‌ట్ట‌మ‌నేని మంజుల ద‌ర్శ‌క‌త్వంలో సంజ‌య్ స్వ‌రూప్‌, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రెస్ మీట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను సూప‌ర్ స్టార్ కృష్ణ‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్ర‌రావు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

సూప‌ర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ – “కిర‌ణ్‌గారు మంచి మంచి సినిమాలు చేశారు. ఆ బ్యాన‌ర్‌తో క‌లిసి ఇందిర సినిమా చేయ‌డం మంచి విష‌యం..ఆనందంగా ఉంది. మంజుల క‌థ రాసుకుని, డైలాగ్స్ రాసుకుని ..డైరెక్ష‌న్ చే్స్తుంద‌ని నాకు తెలియ‌దు. త‌న టాలెంట్ గురించి నాకు తెలియ‌దు. ఈ సినిమా క‌థ నాకు తెలియ‌దు. అయితే ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ చూశాను. చాలా బావుంది. డెఫనెట్‌గా సినిమా సూప‌ర్‌హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ – “గ‌త న‌ల‌భై ఏళ్లుగా కృష్ణ‌గారితో ప్ర‌యాణం సాగుతుంది. మంజుల నా ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి త‌ర్వాత డైరెక్ష‌న్ చేస్తాన‌ని చెప్పింది. స‌డెన్‌గా ఓరోజు వ‌చ్చి డైరెక్ష‌న్ చేస్తున్నాన‌ని అంది. అదేంటి నువ్వు నా అసిస్టెంట్‌గా చేస్తావ‌ని అన్నావ్ క‌దా! అని త‌న‌ను అడిగితే నేను మీ ఏక‌ల‌వ్య శిష్యురాల్ని..మీ సినిమాలు చూసి తెలుసుకున్నాన‌ని అంది. నాకు గురు ద‌క్షిణ‌గా రెండు పాట‌లు చూపించింది. చాలా బావున్నాయి. సందీప్ కిష‌న్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. హీరోయిన్స్ చాలా అందంగా క‌న‌ప‌డుతున్నారు. కృష్ణ‌గారు మ‌హేష్‌ను రాజ‌కుమారుడుతో హీరోగా ప‌రిచ‌యం చేసే అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు ద‌ర్శ‌కురాలిగా మారిన మంజుల కృష్ణ‌గారికంటే, నా కంటే మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ద‌ర్శకురాలు మంజుల మాట్లాడుతూ – “నా ఆల్ టైమ్ ఫేవ‌రేట్ హీరో కృష్ణ‌గారు, ఆల్ టైమ్ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావుగారు. నాన్న‌లా నాకు పేరు రావాలంటే సినిమాలే మార్గ‌మ‌ని ఈ రంగంలోకి అడుగుపెట్టాను. సినిమాల్లో న‌టించాను…నిర్మించాను. ఇంకా ఏదో చేయాల‌నిపించింది. అందుకే నేనే క‌థ‌ను సిద్ధం చేసుకుని ద‌ర్శ‌క‌త్వం చేశాను. నా మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన క‌థ ఇది. సందీప్ కిషన్‌, అమైరా, త్రిదా చాలా క్యూట్‌గా క‌నిపిస్తారు. ర‌వి యాద‌వ్ ఎక్స‌లెంట్ విజువ‌ల్స్ ఇచ్చారు. ర‌ధ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. కొత్త ఆలోచ‌న‌ల‌తో తెర‌కెక్కించిన సినిమా. జెమిని కిర‌ణ్‌, సంజ‌య్ స్వ‌రూప్ సినిమాఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. నాకే కాదు..మీ మ‌న‌సుకు కూడా న‌చ్చే సినిమా అవుతుంది“ అన్నారు.

హీరో సందీప్‌కిష‌న్ మాట్లాడుతూ – “స్వీట్ సింపుల్ హార్ట్ ట‌చింగ్ ల‌వ్‌స్టోరీ ఇది. ఇది ప్యూర్ ల‌వ్ స్టోరీ..ఎప్పుడో ఇలాంటి ల‌వ్ స్టోరీ చేయాల‌నుకున్నాను కానీ, ఇప్ప‌టికి కుదిరింది. ఇలాంటి మంచి ల‌వ్ స్టోరీలో అవ‌కాశం క‌ల్పించిన మంజుల అక్క‌కు థాంక్స్‌. ఆమె నాకు అక్క‌య్య లేని లోటును తీర్చారు. సంజ‌య్ స్వ‌రూప్‌గారు కూడా నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు. నా కెరీర్ మంచి సినిమాను చేశాన‌ని తృప్తిని క‌లిగించిన సినిమా ఇది“ అన్నారు.

నిర్మాత సంజ‌య్ స్వ‌రూప్ మాట్లాడుతూ – “మంజుల‌కు ద‌ర్శ‌కురాలు కావాల‌నే కోరిక ఈ సినిమాతో తీరుతుంది. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంది. ఈ సినిమా చేయ‌డం ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీం“ అన్నారు.

నిర్మాత పి.కిరణ్ మాట్లాడుతూ – “ఫ‌స్ట్ కాపీ రెడీ అయ్యింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. జ‌న‌వ‌రి 26న సినిమాను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఇంకా సాయిమాధ‌వ్ బుర్రా, ప్రియ‌ద‌ర్శి, పున‌ర్న‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్తుర్‌, త్రిదా చౌద‌రి, జాన్వి స్వ‌రూప్‌, నాజ‌ర్‌, గీత‌, ఆదీశ్వ‌ర‌న్, ప్రియ‌ద‌ర్శి, పున‌ర్న‌వి, అభ‌య్‌, అనితా చౌద‌రి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లు: సాయి మాధ‌వ్ బుర్రా, సాహిత్యం: అనంత్ శ్రీరాం, ఆర్ట్‌: హ‌రి వ‌ర్మ‌, స్టంట్స్‌: జాషువా, ఎడిట‌ర్: స‌తీష్ సూర్య‌, మ్యూజిక్‌: ర‌ధ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌వియాద‌వ్‌, నిర్మాత‌లు: స‌ంజ‌య్ స్వ‌రూప్‌, పి.కిర‌ణ్‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఘ‌ట్ట‌మ‌నేని మంజుల‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here