‘కళాతపస్వి’ డాక్టర్ కె. విశ్వనాధ్ గారు రాష్ట్రపతి చేతుల మీదగా దాదా సాహెబ్ ఫాల్కే పునస్కారం స్వీకరించిన సందర్భం గా అన్నమాచార్య మిషన్ వ్యవస్థాపకులు కామిశెట్టి శ్రీనివాసులు , సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన సీనియర్ అభిమాని , నవ్య నాటక సమితి అధ్యక్షులు వేమరాజు విజయకుమార్ , సమన్వయ కర్త శ్రీమతి వి. శ్రీమణి , పద్మాలయ స్టూడియోస్ పి .ఆర్ . ఓ బాలాజీ శర్మ, రంగ రెడ్డి జిల్లా సూపర్ స్టార్ మహేష్ సేన అధ్యక్షులు , బాల నగర్ డివిజన్ కార్పోరేటర్ కాండూరి నరేంద్రచార్యులు, మందాడి సుధాకర్ రెడ్డి , బి .ఎన్. స్వామి , కె. నాగరాజు శుభాకాంక్షలు తెలియ చేసి , ఇది సినీ , నాటక సాహిత్య రంగాలలో కళా తపస్వి , ప్రముఖ దర్శకులు కె . విశ్వనాధ్ గారికి దక్కిన అపూర్వ గౌరవం గా భావిస్తున్నాము అని ఇది తెలుగు ప్రజలకు గర్వ కారణం గా పేర్కొన్నారు.



