లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న సినిమా `కొత్త కుర్రోడు`. ల‌క్ష్మ‌ణ్ ప‌దిలం నిర్మాత‌. మోహ‌న్‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌రామ్‌-శ్రీ‌ప్రియ‌, మ‌హేంద్ర‌-ఆశ జంట‌లుగా న‌టిస్తున్నారు. పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ ముఖ్యఅతిధిగా నేడు పాట‌ల రికార్డింగు హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ -“అంతాకొత్త కుర్రాళ్ల‌తో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. సినిమా బాగా వ‌స్తోంది. పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రెండు షెడ్యూళ్ల లో టాకీ పూర్తి చేశాం. త్వ‌ర‌లోనే పాట‌ల్ని తెర‌కెక్కించ‌నున్నాం. కొత్త కుర్రాళ్లే ఈ సినిమాకి, ఎంచుకున్న క‌థ‌కు ప్ర‌ధాన‌బ‌లం. విజ‌యంపై ధీమా ఉంది“ అన్నారు.

రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ -“న‌వ‌త‌రాన్ని ఎంక‌రేజ్ చేస్తూ ఈ యూనిట్ చేస్తున్న ప్ర‌య‌త్నం అభినంద‌నీయం. పెద్ద విజ‌యం అందుకోవాలి“ అన్నారు.

చేబ్రోలు శ్రీ‌ను విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టుటు జె.వి.రావు, యోగి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి, ర‌చ‌న: శ్రీ‌కుమార్‌, నిర్వాహ‌ణ : రాజా నాయుడు.⁠⁠⁠⁠