పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఈ మార్చ్ 24 న విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ North Star Entertainment , అభిమానులను ఆనంద పరచటానికి ఓ కొత్త ఆలోచన తో వస్తున్నారు . Echora అనే సంస్థను official merchandise గా నియమిస్తూ, వారితో ఆనుసంధానమై , కాటమరాయుడు T – Shirts మరియు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో వాడిన లాంటి పచ్చ రంగు towels ను Online ద్వారా మరియు నేరుగా Echora డీలర్ల వద్ద ,తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశంలో కాటమారాయుడు విడుదలయ్యే కేంద్రాల్లో లభ్యమవుతాయని  చిత్ర నిర్మాణ సంస్థ తెలియ చేసింది . అభిమానులను దృష్టిలో పెట్టుకొని వారికి అందుబాటు ధరకు ఇవి లభ్యమౌతున్నాయి. Online లో పై వాటిని కొనదలచిన వారు katamarayudustore.com ద్వారా కొనుగోలు చేస్కోవచ్చు . రెండ్రోజుల క్రిందట ఇవి మార్కెట్ లో విడుదలయ్యి పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి .