‘యమన్‌’ నాకు మరింత మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది – విజయ్‌ ఆంటోని

0
405

నకిలీ, బిచ్చగాడు, బేతాళుడు వంటి డిఫరెంట్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో విజయ్‌ ఆంటోని. లేటెస్ట్‌గా ‘యమన్‌’గా మరోసారి అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవశంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో, మ్యూజిక్‌ డైరెక్టర్‌ విజయ్‌ ఆంటోనితో ఇంటర్వ్యూ..

ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలకు భిన్నమైన సినిమాగా వస్తున్న ‘యమన్‌’ ఎలా వుండబోతోంది?
– ఇది ఒక పొలిటికల్‌ థ్రిల్లర్‌. ప్రజెంట్‌గా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు, ఈసినిమాకి ఎలాంటి సంబంధం లేదు. మన పొలిటీషియన్స్‌ ఎలా వుంటారో మనకు తెలుసు. వారిని దృష్టిలో వుంచుకొని ఈ సినిమా చేశాం. ఒక సాధారణ వ్యక్తి మినిస్టర్‌ ఎలా అయ్యాడు అనేది ప్రధాన ఇతివృత్తం.

ప్రస్తుతం తమిళనాడులో రాజకీయంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో వాటిని తలపించే సీన్స్‌ ఏమైనా వున్నాయా?
– ప్రజెంట్‌గా తమిళనాడులోని పాలిటిక్స్‌కి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. ఐదు సంవత్సరాల క్రితమే రాసిన కథ ఇది. పాలిటిక్స్‌ ఎక్కడైనా ఒక్కటే. వ్యక్తులు మాత్రమే మారతారు తప్ప వాళ్ళు చేసే పనులన్నీ ఒకలాగే వుంటాయి. కాబట్టి ఈ కథ అన్ని ప్రాంతాలవారికి నచ్చుతుంది.

‘యమన్‌’ అని టైటిల్‌ పెట్టడానికి రీజన్‌?
– దుష్ట శక్తుల పాలిట ఇందులో హీరో యముడులా వుంటాడు. కాబట్టి ‘యమన్‌’ అనే టైటిల్‌ పెట్టాం. యమన్‌ అనేది శివుడి అవతారం, ధర్మాన్ని కాపాడేవాడు యముడు.

నిర్మాత రవీందర్‌రెడ్డి గురించి?
– చాలా నైస్‌ ప్రొడ్యూసర్‌. సినిమాని చాలా గ్రాండ్‌గా ప్రమోట్‌ చేస్తున్నారు. సినిమా అందరికీ రీచ్‌ అయ్యేలా రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తున్నారు.

‘యమన్‌’ మీకు ఎలాంటి సినిమా అవుతుందనుకుంటున్నారు?
– అన్ని సినిమాలూ సూపర్‌హిట్‌ కావాలని కోరుకోవడం కరెక్ట్‌ కాదు. ప్రతి సినిమా నకిలీ కాదు, బిచ్చగాడు కాదు. ఆయా సినిమా స్క్రిప్ట్‌కి తగ్గట్టుగానే ఆడియన్స్‌ని రీచ్‌ అవుతుంది. అలాగే ‘యమన్‌’ ఓ డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. డెఫినెట్‌గా నాకు మంచి పేరు తెస్తుంది.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?
– తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాను. ఈ రెండు వెర్షన్స్‌కి వేర్వేరు టెక్నీషియన్స్‌ పనిచేస్తారు. తెలుగు వెర్షన్‌కి తెలుగు వారికే అవకాశం ఇస్తున్నాం. తమిళ్‌ వెర్షన్‌కి తమిళ్‌వారే వర్క్‌ చేస్తారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు విజయ్‌ అంటోనీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here