ప్రశాంతి నిలయంలో షూటింగ్ జరుపుకుంటున్న ‘ శ్రీ సత్యసాయి బాబా ‘

0
388

సౌభాగ్య చిత్ర,  ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న  చిత్రం -“శ్రీ స‌త్య‌సాయి బాబా`. `అమ్మోరు`, `అరుంధ‌తి` ‘ దేవుళ్లు ‘ వంటి విజువ‌ల్ వండ‌ర్స్‌ని అందించిన కోడి రామ‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం  వ‌హిస్తున్నారు. క‌రాటం రాంబాబు నిర్మాత‌. పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి బాబాపై తెర‌కెక్కిస్తున్న ఈ  చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాల్ని అందిస్తున్నారు. జొన్న‌విత్తుల  సింగిల్ కార్డ్‌లో 14 పాట‌లకు సాహిత్యం అందించ‌డం విశేషం.    ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. ఎదైతే పుట్టపర్తిలో జరిగిన సంఘటనల్ని  యథాతథంగా ఈ సినిమాని తీస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ‘ ప్రశాంతి నిలయం ‘ భారీ సెట్ లో నెల రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. మార్చి 10 వరకు ఈ షెడ్యూల్  జరగుతుంది . ఈ సినిమా ‘ సత్యసాయి బాబా ‘ జీవిత చరిత్రని చూపించే అపురూపమైన చిత్రం ఇది. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా సత్యసాయి గారు చేపట్టిన క్యాష్ లెస్ ప్రీ హార్ట్ సర్జరీ,  అన్ని ఫ్రీ గా ఇచ్చేట్టు పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా అది అమలు జరుగుతూనే ఉన్నాయి.  ఇలాంటి ఎన్నో అద్భతమైన విషయాల గురించి తెలియ చెప్పే చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్ లో విడుదలవుతోంది.

స‌త్య‌సాయిగా మ‌ల‌యాళ న‌టుడు శ్రీ‌జిత్ విజ‌య్ న‌టిస్తున్నారు. స‌త్య‌సాయికి మాతృమూర్తి గా జ‌య‌ప్ర‌ద‌, తండ్రి పాత్ర‌లో శ‌ర‌త్‌బాబు న‌టిస్తున్నారు. ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌హాస‌న్‌కి మేక‌ప్‌మేన్‌గా ప‌నిచేసిన ర‌మేష్ మెహంతి ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. ఇప్ప‌టికే పాట‌ల రికార్డింగ్ పూర్త‌యింది.మంగళంపల్లి బాల ముర‌ళి కృష్ణ‌ తన చివరి సినిమా సాంగ్ కూడా ఈ సినిమానే కావడం విశేషం. ఈ సినిమా పాటల్లో ఆయన పాట హైలెట్ గా నిలుస్తుంది.ఇంకా ఈ సినిమాకి ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, వందేమాత‌రం శ్రీ‌నివాస్‌, చిత్ర, హ‌రిచ‌ర‌ణ్‌, విజ‌య్ ప్ర‌కాష్‌, క‌వితా కృష్ణ‌మూర్తి, కైలాస్ కేర్,  సుఖ్వింద‌ర్ సింగ్, మ‌ల్లాడి బ్ర‌ద‌ర్స్‌, ఆండ్రియా, టిప్పు త‌దిత‌రులు గానాలాప‌న చేశారు. ప్ర‌ఖ్యాత ఛాయాగ్రాహ‌కుడు వాసు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here