ఎస్ 3 యముడు 3 రివ్యూ

0
442

కథ :

కర్ణాటకలోని మంగుళూరు లో పోలీస్ కమీషనర్ హత్య కేసు ని ఛేదించడానికి నర్సింహం (సూర్య) ని ప్రత్యేకంగా నియమించడంతో సినిమా మొదలవుతుంది. మొదట అక్కడి రౌడీలకి అనుకూలంగా ఉన్నట్టు ఉంటూనే తన పని తాను చేసుకుపోతుంటాడు నరసింహం. మొదట నరసింహం ని అపార్ధం చేసుకుని తర్వాత ప్రేమించే జర్నలిస్ట్ పాత్రలో విద్య (శృతి హాసన్) కనిపిస్తారు. కావ్య (అనుష్క) తన భార్య అయినప్పటికీ విడాకులు తీసుకున్నట్టు అందరికీ చెప్తాడు నరసింహం. కమీషనర్ హత్య కేసు వెనక పెద్ద కుట్రే ఉన్నట్టు నరసింహం కనుక్కుంటాడు. ఆ కుట్ర వెనక ఉన్నదెవరు ? దాన్ని ఎలా ఛేదించాడు ? అన్నదే ఎస్ 3 యముడు – 3

నటన :

సింగం సిరీస్ అనగానే పవర్ఫుల్ పోలీస్ గా సూర్య నటన గుర్తొస్తుంది. మొదటి, రెండవ భాగాల్లో ఆయన అభినయం పోలీస్ పాత్రలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇందులో సూర్య విశ్వరూపం చూపారనే చెప్పాలి. భయం అంటే తెలియని పోలీస్ పాత్రలో సూర్య అంతా తానై నడిపించారు. సింగం సిరీస్ లో మొదటి సినిమా నుండి అదే ఎనర్జీ, ఇంటెన్సిటీ చూపిస్తున్న సూర్య ని అభినందించకుండా ఉండలేం. కొన్ని సన్నివేశాలు కేవలం తన అభినయంతో రక్తి కట్టించగలిగారు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సూర్య నే.

ఇక ఎట్టకేలకు ఈ భాగంలో అనుష్క కి ప్రేయసి పాత్ర నుండి భార్య పాత్రకి ప్రమోషన్ దక్కింది. తన పరిధి మేరకు అనుష్క బాగానే చేశారు. జర్నలిస్ట్ పాత్రలో శృతి హాసన్ గ్లామరస్ గా కనిపిస్తారు. క్రూరమైన విలన్ పాత్రలో ఠాకూర్ అనూప్ సింగ్ పర్వాలేదు అనిపిస్తారు. ఇక ఇతర పాత్రలకి రాధికా శరత్ కుమార్, శరత్ సక్సేనా, సుమన్ సరిపోయారు.

బలాలు :

సూర్య పవర్ఫుల్ పెర్ఫార్మన్స్
హరి వేగవంతమైన కథనం
కమర్షియల్ అంశాలు
ఏక్షన్ సన్నివేశాలు

బలహీనతలు :

కామెడీ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

విశ్లేషణ :

నరసింహం పాత్ర గురించి తెలుసు కాబట్టి ప్రారంభం అయినప్పటి నుండే దర్శకుడు హరి తనదైన శైలిలో వేగవంతమైన కథనంతో సినిమాని పరిగెత్తిస్తారు. మిగిలిన పాత్రల పరిచయం, నరసింహం లక్ష్యం ఏమిటో తెలిసే వరకు సినిమా ఒక మోడ్ లో వెళ్లి ఇంటర్వెల్ దగ్గిర తన దిశా మార్చుకుంటుంది. ఈ ప్రథమార్థం లో శృతి హాసన్ పాత్ర మీద మరింత శ్రద్ధ పెట్టుంటే బావుండేది.

ఇక ద్వితీయార్ధం మొదలైనప్పటి నుండి హరి తన కథనంలో వేగాన్ని మరింత పెంచారు. విలన్ ఇండియా కి వచ్చినప్పటి నుండి హీరో-విలన్ ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో చివరి వరకు సినిమా అదే వేగంతో దూసుకెళ్తుంది. కామెడీ పెద్దగా అలరించదు. హరి ప్రధాన బలం వేగంగా సాగే కథనం. ఇందులో కూడా తన బలానికి తగ్గట్టు ఏక్షన్, సన్నివేశాలు ,చేస్ లు డిజైన్ చేసుకున్నారు. ద్వితీయార్ధం సినిమాకి ప్రధాన బలం.ఖర్చుకి వెనుకాడని స్టూడియో గ్రీన్, సురక్ష, పెన్ సంస్థల ఉన్నత నిర్మాణ విలువలు ఏక్షన్, చేస్ ల లో కనిపిస్తాయి.

సూర్య, హరి తమ సక్సెఫుల్ కాంబినేషన్ ని మూడవ భాగం లో కూడా కొనసాగించారు. సింగం సిరీస్ ని , ఏక్షన్ చిత్రాలని ఇష్టపడే వాళ్ళని అలరించే ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధిస్తుంది.

మరోసారి గర్జించిన నర’సింగం’
రేటింగ్ : 3 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here