‘అలియాస్ రుక్మిణి’ నా కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది. నా మనసుకు నచ్చి ఈ సినిమా చేశాను. చూసిన తర్వాత మీకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో నితిన్
నాని ప్రజెంట్స్, నితిన్, మురళీకాంత్ దేవసోత్, దీప్తి గంటా, యూనానిమస్ ప్రొడక్షన్స్ ‘అలియాస్ రుక్మిణి’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్
నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్లు, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నాని తన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. “ఈ డిసెంబర్ 4న మీ ఇంటికి తీసుకెళ్లేలా ఒక మంచి సినిమాను ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థియేటర్లకు వస్తే.. మిమ్మల్ని బాగా చూసుకుంటాడు కృష్ణ :)” అని ట్వీట్ చేశారు.
కృష్ణ మిడిల్ క్లాస్ యువకుడు, ఫ్యామిలీ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసే కృష్ణకు వచ్చే విచిత్రమైన కలలే అతడిని అడల్ట్ నవలలు రాసేలా చేస్తాయి. అయితే రుక్మిణి అనే కలం పేరుతో అతను రాసిన నవలలు అనూహ్యంగా బెస్ట్ సెల్లర్స్‌గా మారతాయి. కానీ ఆ రచనల వెనుక ఉన్న అసలు విషయం అతడి వ్యక్తిగత జీవితంలో సమస్యలకు కారణమవుతుంది. ఇప్పటికే ముగ్గురు అమ్మాయిల దగ్గర తిరస్కరణ ఎదుర్కొన్న కృష్ణ జీవితంలోకి నాలుగో అమ్మాయి వస్తుంది. కొంత సమయం తీసుకున్న తర్వాత ఆమె కృష్ణను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించగలమని భావిస్తున్న సమయంలో కృష్ణ అసలు గుర్తింపు, అతను రాసిన నవలల వెనుక ఉన్న నిజం ఆమెకు తెలుస్తుంది. దీంతో వారి బంధంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ట్రైలర్లో సినిమా కథాంశాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తూనే, అసలు సమస్యను మాత్రం పూర్తిగా రివీల్ చేయలేదు. దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ హ్యూమర్, రొమాన్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాను కలిపి ఒక ఎంటర్టైనింగ్ కథనాన్ని రూపొందించారు. కృష్ణ ఎదుర్కొనే విచిత్రమైన పరిస్థితులు, అతడి రహస్యం వల్ల ఎదురయ్యే పరిణామాలపై క్యూరియాసిటీ పెంచేలా ట్రైలర్ కట్ చేశారు.
కృష్ణ పాత్రలో నితిన్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ యువకుడిలో ఉండే అమాయకత్వం, ఇబ్బందికరమైన పరిస్థితులు, భావోద్వేగాలను తన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో చక్కగా చూపించారు. కామెడీతో పాటు ఎమోషన్స్‌ను కూడా బ్యాలెన్స్ చేసేలా ఆయన పాత్ర ఆకట్టుకుంది. హీరోయిన్గా ఆఫియా సయ్యద్ ఆకట్టుకున్నారు. తన పాత్రలో ఉండే చలాకీతనం, ప్రేమ, ఎమోషన్స్‌ను చక్కగా పలికించారు. నితిన్, ఆఫియా జోడీ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. హర్షవర్ధన్, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించి కథకు మరింత బలాన్ని చేకూర్చారు.
టెక్నికల్‌గా కూడా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జోమోన్ టి. జాన్ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ కథనానికి మంచి విజువల్ ఫ్లోను అందించింది. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ కథకు తగిన సహజత్వాన్ని తీసుకొచ్చింది. విజయ్ బుల్గానిన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలాల్లో ఒకటిగా నిలవనుంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలకు ఆయన అందించిన సంగీతం చక్కగా కుదిరింది. సృజన ఆడుసుమిల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆసక్తికరమైన కథాంశం, రిలేటబుల్ క్యారెక్టర్లు, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమా ఒక మంచి రోలర్ కోస్టర్ రైడ్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ హామీ ఇస్తోంది. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో నితిన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘అలియాస్ రుక్మిణి’ నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా. గతంలో నా సినిమాలు కొన్ని కమర్షియల్ లెక్కలు వేసుకుని చేశాను. కానీ ఫస్ట్ టైమ్ ఎలాంటి లెక్కలు వేసుకోకుండా, కథ నచ్చి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. ఇందులో పాటలు ఉన్నాయా? ఫైట్లు ఉన్నాయా? డాన్సులు ఉన్నాయా? ఇలాంటివేమీ ఆలోచించలేదు. నా మనసుకు నచ్చి ఈ సినిమా చేశాను. సినిమా చూశాక మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా డైరెక్టర్‌కి ఒక విషయం క్లియర్‌గా చెప్పాను. కేవలం కంటెంట్‌ను నమ్మి, మంచి కథతో సినిమా చేద్దామని చెప్పే ఈ సినిమాను చేశాను. దీప్తి గారు ఈ సినిమాకు బిగ్గెస్ట్ పిల్లర్. ఒక బిడ్డను తల్లి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, ఈ సినిమాను దీప్తి గారు అంత జాగ్రత్తగా చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ, ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్న ఒక ప్రొడ్యూసర్‌తో పని చేశాను. తను మా సినిమాకు శివగామి (నవ్వుతూ) విజయ్ మా సినిమాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆ పాటలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. సినిమా చూశాక ఈ పాటలను మళ్లీ రిపీట్ మోడ్‌లో పెట్టుకుంటారు. ‘ఇష్క్’ తర్వాత నాకు మళ్లీ ఆ రేంజ్ సాంగ్స్ పడ్డాయి. ఆఫియా చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తను మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. అలాగే మా ఎడిటర్ సృజన కూడా ఈ సినిమాకు బిగ్గెస్ట్ పిల్లర్. మా డైరెక్టర్ మురళి గురించి ఒకే మాట చెప్తాను. తను తెలుగు సినిమాకు ఒక రాజ్‌కుమార్ హిరణి. ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీరు సినిమా చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది. ఒకే సీన్ లో నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఆలోచింపజేస్తాడు. కృష్ణ క్యారెక్టర్‌ను తప్పకుండా మీరందరూ ఇష్టపడతారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు మరో సీక్రెట్ సూపర్‌స్టార్ ఉన్నారు. నాని . తను లేనిదే ఈ సినిమా లేదు. కమర్షియల్ సినిమాలు చేసే నాతో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చేస్తానని నమ్మారు. నా కెరీర్లో బెస్ట్ సినిమా ఇచ్చిన నానికి థాంక్యూ. లవ్ యూ నాని. డిసెంబర్ 4న సినిమా వస్తోంది. కచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అదే రోజు ‘వృషకర్మ’ సినిమా కూడా వస్తోంది. అన్ని సినిమాలు ఆడాలి. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. జై తెలుగు సినిమా!
హీరోయిన్ ఆఫియా సయ్యద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ సినిమా. మీరందరూ ఇష్టపడతారని నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, నాని గారికి థాంక్యూ సో మచ్. డిసెంబర్ 4న అందరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నితిన్ అన్నకి థాంక్యూ. డిసెంబర్ 4న మీరందరూ ఒక అందమైన సినిమాను చూస్తారు. కచ్చితంగా ప్రేమిస్తారు. చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, నాని గారికి, దీప్తి గారికి ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డిసెంబర్ 4న అందరం థియేటర్లలో కలుద్దాం.
నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ.. ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. నితిన్ ఫ్యాన్స్‌గా థియేటర్‌కు వచ్చిన మీరు, సినిమా చూసిన తర్వాత కృష్ణ ఫ్యాన్స్‌గా తిరిగి వెళ్తారు. అంత అద్భుతంగా నితిన్ నటించారు. ఈ టీమ్‌తో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. డిసెంబర్ 4న ఒక బ్యూటిఫుల్ సినిమా చూస్తారు. అప్పుడు మళ్లీ మాట్లాడుకుందాం.
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. సినిమా ఇంకా బాగుంటుంది. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన నాని గారికి, నితిన్ గారికి, మురళి గారికి ధన్యవాదాలు. నితిన్ గారితో సినిమా చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. రీ-రికార్డింగ్ పూర్తయింది. సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత మీరు నితిన్ గారితో ప్రేమలో పడతారు. అలాగే మా మ్యూజిక్‌తో కూడా ప్రేమలో పడతారు.
నటీనటులు: నితిన్, ఆఫియా సయ్యద్, సాయికుమార్, హర్షవర్ధన్.
టెక్నికల్ టీమ్:
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్
కథ, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ టి. జాన్ ఐఎస్సీ
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గరపు
పబ్లిసిటీ డిజైనర్: భరణిధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్



