సూపర్ మార్కెట్ షాపింగ్ ఇక మీ చేతిలోనే.. సేల్స్ బీజ్ యాప్‌ ప్రారంభం

0
5
Grand Launch Of 'Sales Beez' App
Grand Launch Of 'Sales Beez' App

సూపర్ మార్కెట్ షాపింగ్ ఇక మీ చేతిలోనే.. సేల్స్ బీజ్ యాప్‌ ప్రారంభం

గ్రోసరీస్ నుంచి గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువుల వరకు.. అన్నీ ఒకే చోట!

మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ మైనంపల్లి రజిత తో కలిసి సేల్స్ బీజ్ సీఎండీ కుకట్ల శ్రీనివాస్, శ్రీదేవి కడియాల సేల్స్ బీజ్’ యాప్‌ మరియు టెర్రాన్ ఈవీ స్కూటర్ల ను ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల్లో ‘సెయిల్స్ బీస్’ సంచలనం!

* తెలంగాణ, ఏపీలలో 13,266 స్టోర్‌ల ఏర్పాటుకు శ్రీకారం
* యాప్ లాంచ్ అయిన ఒక్క గంటలోనే 10 లక్షల డౌన్‌లోడ్స్ రికార్డ్
* సంక్రాంతి తర్వాత హైదరాబాద్‌లో 10 నిమిషాల్లోనే సరుకుల డెలివరీ

హైదరాబాద్, నవంబర్ 26: ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ‘సేల్స్ బీజ్’ యాప్‌ను ప్రారంభించారు. గ్రోసరీస్, పండ్లు, కూరగాయలు, గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులు సహా వివిధ రకాల ఉత్పత్తులను ఒకే యాప్ ద్వారా కొనుగోలు చేసుకునే సదుపాయం కల్పించారు. అలాగే ఎస్‌బీ స్టోర్స్ ద్వారా మినీ స్టోర్, మార్కెట్ స్టోర్, సూపర్ స్టోర్ విభాగాల్లో సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి బ్రాండ్, మార్కెటింగ్, టెక్నాలజీ, నిర్వహణ సహకారం అందించనున్నారు.

సేల్స్ బీజ్ సీఎండీ కుకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ కిరాణా బడ్జెట్‌పై భారం తగ్గించే లక్ష్యంతో ‘సెయిల్స్ బీస్’ (Sales Bees) సంస్థ తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను ఘనంగా ప్రారంభించింది. ఆన్‌లైన్ (ఈ-కామర్స్), ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్‌లు మరియు 10 నిమిషాల క్విక్-కామర్స్ సేవలను ఒకే వేదికపైకి తెస్తూ దేశంలోనే తొలిసారిగా సరికొత్త త్రిమొడల్ (Tri-Model) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అని తెలిపారు.

2021లో ఈ ఆలోచనకు బీజం పడగా, సుమారు 30 దేశాల్లోని మార్కెట్ తీరుతెన్నులపై నాలుగేళ్ల పాటు లోతైన అధ్యయనం చేసిన అనంతరం సంస్థ ఈ అడుగు వేసింది. దేశంలోని అగ్రశ్రేణి సూపర్ మార్కెట్లలో 30 నుంచి 40 ఏళ్ల అనుభవమున్న దిగ్గజాల నేతృత్వంలో ఈ సంస్థ రూపుదిద్దుకుంది.

సెయిల్స్ బీస్ ప్రత్యేకతలు ఇవే:

* ప్రతి ఊరిలో స్టోర్: డెలివరీలో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని 66 నగరాలు, 1,200 మండలాలు, 12,000 గ్రామాలను కలుపుతూ మొత్తం 13,266 స్టోర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దసరా నుంచి ఇప్పటివరకు 11 స్టోర్‌లు ప్రారంభం కాగా, డిసెంబర్ 25 నాటికి 100లు స్టోర్స్ అందుబాటులోకి రానున్నా.

* 10 నిమిషాల్లోనే డెలివరీ: హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 600 డార్క్ స్టోర్‌లను సిద్ధం చేశారు. రాబోయే సంక్రాంతి పండుగ తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే వినియోగదారుల ఇంటి వద్దకు సరుకులను చేరవేయనున్నారు.

* గంటలోనే రికార్డ్: నేడు విడుదలైన సెయిల్స్ బీస్ ఈ-కామర్స్ యాప్‌కు అనూహ్య స్పందన లభించింది. లాంచ్ అయిన తొలి గంటలోనే 10 లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాబోయే రెండు నెలల్లో కోటి డౌన్‌లోడ్స్ మార్కును చేరుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

* నెలకు రూ. 1,000 వరకు ఆదా: నెలకు సగటున రూ. 10 వేల వరకు కిరాణా సామాగ్రి కొనుగోలు చేసే ప్రతి కుటుంబానికి, సెయిల్స్ బీస్ ద్వారా కనీసం రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఆదా అయ్యేలా ధరలను నిర్ణయించారు.

* స్థానిక ఉత్పత్తులు & ఈవీ స్కూటర్లు: కేవలం కిరాణా సరుకులే కాకుండా, ఏపీలోని ఇ-మహిళా సంఘాలు, గిరిజన సహకార సంఘాలు, స్థానిక తయారీదారులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు ఇదొక వేదికగా నిలవనుంది. ఇదే వేదికపై సంస్థ తన నూతన టెర్రాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను (EV) కూడా మార్కెట్లోకి విడుదల చేసింది.

ఫ్రాంచైజీలకు భారీ స్పందన:

తెలుగు రాష్ట్రాల్లో సెయిల్స్ బీస్ స్టోర్‌లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 1.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల sa ఆర్థిక సామర్థ్యం, నేపథ్యాన్ని పరిశీలించి స్టోర్‌లను కేటాయిస్తున్నారు. సరుకుల సరఫరా (ఇన్వెంటరీ), మార్కెటింగ్, ప్రకటనలు, రిటర్న్స్ వంటి బాధ్యతలన్నింటినీ కంపెనీయే పూర్తిగా చూసుకుంటుందని, స్టోర్ యజమానులు కేవలం నిర్వహణపై దృష్టి పెడితే సరిపోతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here