‘ది ఇండియన్ బార్డర్’ చిత్రీకరణ పూర్తి.. త్వరలోనే విడుదల

0
6
The Indian Border Wraps Up Shooting
The Indian Border Wraps Up Shooting

‘ది ఇండియన్ బార్డర్’ చిత్రీకరణ పూర్తి.. త్వరలోనే విడుదల

ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సిందు తులాని ముఖ్య పాత్రలను పోషించారు. కె మ్యూజిక్ ఈ మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలోని ‘జిందా రహేన్ తో డ్యూటీ’ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ క్రమంలో విడుదల చేసిన పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అటు భారత్, ఇటు పాక్.. అటు మన సైనికుడు.. ఇటు పాక్ సైనికుడు ఇలా అన్నింటినీ కలిపి చూపించే ఈ పోస్టర్ ఎంతో ఇంటెన్స్‌గా ఉంది. దేశ భక్తిని చాటే ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఓ కొత్త అనుభూతినిచ్చేలా ఉంటుందని టీం నమ్మకంగా చెప్తోంది.

ఈ మూవీకి నలినికాంత్ కొండపల్లి కెమెరామెన్‌గా, కె. రమేష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. హర్నాథ్ సింగులూరి, గౌరి శంకర్ నడిపల్లి పాటలకు సాహిత్యాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ అప్డేట్‌లను ప్రకటించనున్నారు.

నటీనటులు : కిరణ్ యార్లగడ్డ , ఆదర్శ్, మురళీ మోహన్, మేఘశ్రీ, సింధు తులాని, గజ్జెల మాయ మశ్చేంద్ర, ఆదిత్య మీనన్, అజయ్, ఇందు ఆనంద్, ఉమ వూరుకొండ, షాన్, పాషా, తిరుపతి దొరై, రాజేందర్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్
నిర్మాత : నివేద్య రెడ్డి
దర్శకుడు : డి.ఎస్. బాషా
కథ :కిరణ్ యార్లగడ్డ
సంగీతం :ఆనంద్ మంత్ర
కెమెరా : నలినికాంత్ కొండపల్లి
ఎడిటింగ్ : కె. రమేష్
అసోసియేట్ ఎడిటర్ : అనుగోజు రేణుక బాబు
కొరియోగ్రాఫర్ : ఈ. రమేష్ మాస్టర్
లిరిక్స్ : హర్నాథ్ సింగులూరి, గౌరి శంకర్ నడిపల్లి
పీఅర్ఓ: సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here