‘ది ఇండియన్ బార్డర్’ చిత్రీకరణ పూర్తి.. త్వరలోనే విడుదల
ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సిందు తులాని ముఖ్య పాత్రలను పోషించారు. కె మ్యూజిక్ ఈ మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలోని ‘జిందా రహేన్ తో డ్యూటీ’ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఈ క్రమంలో విడుదల చేసిన పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అటు భారత్, ఇటు పాక్.. అటు మన సైనికుడు.. ఇటు పాక్ సైనికుడు ఇలా అన్నింటినీ కలిపి చూపించే ఈ పోస్టర్ ఎంతో ఇంటెన్స్‌గా ఉంది. దేశ భక్తిని చాటే ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఓ కొత్త అనుభూతినిచ్చేలా ఉంటుందని టీం నమ్మకంగా చెప్తోంది.
ఈ మూవీకి నలినికాంత్ కొండపల్లి కెమెరామెన్‌గా, కె. రమేష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. హర్నాథ్ సింగులూరి, గౌరి శంకర్ నడిపల్లి పాటలకు సాహిత్యాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ అప్డేట్లను ప్రకటించనున్నారు.
నటీనటులు : కిరణ్ యార్లగడ్డ , ఆదర్శ్, మురళీ మోహన్, మేఘశ్రీ, సింధు తులాని, గజ్జెల మాయ మశ్చేంద్ర, ఆదిత్య మీనన్, అజయ్, ఇందు ఆనంద్, ఉమ వూరుకొండ, షాన్, పాషా, తిరుపతి దొరై, రాజేందర్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్
నిర్మాత : నివేద్య రెడ్డి
దర్శకుడు : డి.ఎస్. బాషా
కథ :కిరణ్ యార్లగడ్డ
సంగీతం :ఆనంద్ మంత్ర
కెమెరా : నలినికాంత్ కొండపల్లి
ఎడిటింగ్ : కె. రమేష్
అసోసియేట్ ఎడిటర్ : అనుగోజు రేణుక బాబు
కొరియోగ్రాఫర్ : ఈ. రమేష్ మాస్టర్
లిరిక్స్ : హర్నాథ్ సింగులూరి, గౌరి శంకర్ నడిపల్లి
పీఅర్ఓ: సాయి సతీష్



