డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ ట్రైలర్ విడుదల
వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాతగా శరత్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లు గా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో రూపొందించిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు శరత్ మాట్లాడుతూ ” ఇటీవల విడుదలైన టీజర్‌కు, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. తండ్రి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన కమర్షియల్ చిత్రమిది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కంట తడి పెట్టించే ఎమోషన్ అందరి హృదయాలను హత్తుకుంటుంది. నిర్మాత దీపక్ ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా డాటర్ అండ్ ఫాదర్ జానర్ సినిమాల్లో ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. హీరో రజత్ రాఘవ్ కెరీర్‌లో మైలురాయిగా ఈ సినిమా నిలుస్తుంది’ అన్నారు.
హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ . రోలర్ కోస్టర్ రైడ్‌లా సినిమా ఉంటుంది. కుటుంబ విలువల్ని చాటి చెప్పే చిత్రమిది. ప్రతీ ఫ్యామిలీకి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.
నిర్మాత డి దీపక్ మాట్లాడుతూ .. ‘ఇది నాకు తొలి చిత్రం. సెట్‌లో ఎప్పుడూ పండుగ వాతావరణం కనిపించేది. ఓ మంచి సినిమాతో నిర్మాతగా అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరిస్తే ఇలాంటి మరిన్ని సినిమాలు వస్తాయి” అన్నారు.
తారాగణం : రజత్ రాఘవ్, కాజల్ చౌదరి, హాసిని సుధీర్, బేబీ పరిణిత రుద్రరాజు తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్: వెన్నెల సిల్వర్ స్క్రీన్
నిర్మాత: డి దీపక్
రచయిత & దర్శకుడు: శరత్
సంగీతం: RH విక్రమ్
సినిమాటోగ్రఫీ: కుశ్వంత్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: మానస వర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వర్ధన్
PRO: మాడూరి మధు



