‘మైసా’లో ఐకానిక్ ‘ఒసేయ్ రాములమ్మ’ సాంగ్‌ను రీక్రియేట్ చేయడం మాపై బాధ్యతను పెంచింది. ‘ఒసేయ్ రాములమ్మ’ హిస్టరీ క్రియేట్ చేసింది. ‘మైసా’కు కూడా అలాంటి ప్రేమని అందిస్తారని కోరుకుంటున్నాను: సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ రష్మిక మందన్న

0
6
Osey Ramulamma Remix Song From Rashmika Mysaa Released
Osey Ramulamma Remix Song From Rashmika Mysaa Released
‘మైసా’లో ఐకానిక్ ‘ఒసేయ్ రాములమ్మ’ సాంగ్‌ను రీక్రియేట్ చేయడం మాపై బాధ్యతను పెంచింది. ‘ఒసేయ్ రాములమ్మ’ హిస్టరీ క్రియేట్ చేసింది. ‘మైసా’కు కూడా అలాంటి ప్రేమని అందిస్తారని కోరుకుంటున్నాను: సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ రష్మిక మందన్న

రష్మిక మందన్న, రవీంద్ర పుల్లె, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పాన్ ఇండియా మూవీ ‘మైసా’ నుంచి  విప్లవ స్ఫూర్తిని రగిలించే ఐకానిక్ ‘ఒసేయ్ రాములమ్మ’ రీమిక్స్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో, అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, రెండు పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది.

ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా నుంచి మూడో సింగిల్‌గా ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను రిలీజ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో విప్లవ స్ఫూర్తిని రగిలించిన ఐకానిక్ పాటల్లో ‘ఒసేయ్ రాములమ్మ’ ఒకటి. విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడంతో పాటు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు అదే పవర్‌ఫుల్ పాటను ‘మైసా’ కోసం రీక్రియేట్ చేశారు. మరోసారి అదే తిరుగుబాటు స్ఫూర్తిని రగిలించేలా ఈ పాటను రూపొందించారు.

ఈ రెండు సినిమాల మధ్య పాటకు మించిన ఆసక్తికరమైన పోలిక కూడా ఉంది. ‘ఒసేయ్ రాములమ్మ’లో విజయశాంతి గిరిజన మహిళగా నటించగా, ‘మైసా’లో రష్మిక మందన్న కూడా ఒక పవర్‌ఫుల్ గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఒరిజినల్ పాటకు పనిచేసిన సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ మరోసారి ఈ కొత్త వెర్షన్ కోసం కలిశారు. ‘మైసా’లో రష్మిక పాత్ర స్వభావం, ఆమె తెగువ, ఎక్కడా రాజీ పడని వ్యక్తిత్వానికి తగ్గట్టుగా పాట సాహిత్యంలో మార్పులు చేశారు. వందేమాతరం శ్రీనివాస్ మరోసారి తనదైన శైలిలో ఈ పాటకు వాయిస్ అందించారు.

సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఈ ఐకానిక్ పాటకు కొత్త మ్యూజికల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అయితే ఒరిజినల్ పాటలోని సోల్ ను అలాగే ఉంచుతూ పవర్‌ఫుల్‌గా రీ-కంపోజ్ చేశారు. పావని వాస, అశ్విని చెపురి, అభిక్య తనికెళ్ల, వినాయక్, వెంకీ, నాని అందించిన ఎనర్జిటిక్ బ్యాకింగ్ వోకల్స్ పాటకు మరింత బలాన్ని చేకూర్చాయి.

ఈ రీమిక్స్ వింటున్నప్పుడు గూస్‌బంప్స్ వచ్చేలా ఉంది. ఒక ఎవర్‌గ్రీన్ క్లాసిక్ పాటలోని మ్యాజిక్‌ను ఇప్పటి మ్యూజిక్ స్టైల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. థియేటర్లలో రష్మిక పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్‌తో ఈ పాట మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయనుంది. ఒరిజినల్ ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను ఇష్టపడే అభిమానులకు ఈ కొత్త వెర్షన్ నోస్టాల్జియాతో పాటు మరింత ఉత్సాహాన్ని ఇవ్వనుంది.

శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు.  

ఈ సినిమాలో రష్మిక మందన్నను ఇంతకుముందెన్నడూ చూడని కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఆమె కెరీర్‌లోనే ఇప్పటివరకు చేయని హై-ఆక్టేన్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. భారీ స్థాయిలో పాన్ ఇండియా స్పెక్టకల్‌గా రూపొందుతున్న ‘మైసా’ నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

https://www.youtube.com/watch?v=f7yF7TPQjuc&list=RDf7yF7TPQjuc&start_radio=1

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ పాట రీక్రియేట్ అనగానే మనసులో కొంచెం భయం మొదలైంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఐకానిక్ సాంగ్. దాన్ని రీక్రియేట్ చేయడం చాలా పెద్ద బాధ్యత. మేము ఒరిజినల్‌ను మ్యాచ్ చేయలేము. కానీ ఆ పాటకు న్యాయం చేసేలా మా ప్రయత్నం చేశాం. వందేమాతరం శ్రీనివాస్ రావు గారి పాట పాడటం చాలా ఆనందంగా ఉంది. అలాగే సుద్దాల అశోక్ తేజ గారు అద్భుతమైన సాహిత్యం రాశారు.  విజయశాంతి మేడమ్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ పాట ఆమెకు ఒక చిన్న ట్రిబ్యూట్. ‘ఒసేయ్ రాములమ్మ’ కథ చాలా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్. ఆ సినిమా ఒక చరిత్ర క్రియేట్ చేసింది. ఇప్పుడు మైసాలో ఈ పాట రీక్రియేషన్‌కు కూడా మీరు అలాంటి ప్రేమనే అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ పాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నవంబర్ 27న థియేటర్లలో కలుద్దాం.

వందేమాతరం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. రష్మిక గారి లాంటి అందమైన, అమాయకమైన అమ్మాయితో ఇంత పవర్‌ఫుల్ కథను దర్శకుడు ఎలా ఊహించారో నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో పాట చూస్తుంటే రష్మిక గారు చాలా ఫియర్స్‌గా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పాట థియేటర్స్ లో గుజ్బంప్స్ తెప్పిస్తుంది.

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇందులో నేను రెండు పాటలు రాశాను. మొదటి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ గారు ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను మళ్లీ ఇందులో ఆవిష్కరించబోతున్నామని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో రష్మిక గారు అద్భుతంగా ఉన్నారు. ఆవిడ పేరు మీద ఒక పాట రాయాలనిపిస్తోంది. రాములమ్మ పాట రాయడం చాలా అద్భుతమైన అనుభూతి. చాలా గొప్ప సందర్భంలో ఈ పాట వస్తుంది. మన తెలంగాణ కోడలు రష్మికకు ఈ పాట రాసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు గర్జన మాత్రమే వినిపించింది. రేపు సింహం కనిపించబోతోంది.

డైరెక్టర్ రవీంద్ర పుల్లె మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. 29 సంవత్సరాల తర్వాత వందేమాతరం శ్రీనివాస్ రావు గారు, సుద్దాల అశోక్ తేజ గారి కాంబినేషన్‌లో ఈ పాట రావడం చాలా విశేషం. మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ ఈ పాటను అద్భుతంగా రూపొందించారు. థియేటర్లలో మీ అందరినీ ఈ పాట అలరిస్తుంది.

అజయ్ మాట్లాడుతూ.. నమస్కారం. ఆదిత్య మ్యూజిక్ నుంచి ఈ సాంగ్‌ను అందించిన ఆదిత్య మ్యూజిక్‌కి, దిల్ రాజు గారికి ధన్యవాదాలు. ఈ పాట ఈ సినిమాకి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సుద్దాల అశోక్ తేజ గారు, వందేమాతరం శ్రీనివాస్ రావు గారు, అలాగే జేక్స్ బిజోయ్ గారు అద్భుతంగా ఈ పాటను రీక్రియేట్ చేశారు. థియేటర్లలో ఈ పాట బ్లాస్ట్ అవుతుంది.

నటీనటులు:రష్మిక మందన్న, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ తదితరులు.
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లె
నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ పి కృష్ణ
స్టంట్స్: కేచా
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here