‘ఆకాశంలో ఒక తార’ చాలా గొప్ప కథ. దుల్కర్ గారి కెరీర్లో మరో మైల్స్టోన్ మూవీగా నిలుస్తుంది. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను: ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
‘ఆకాశంలో ఒక తార’ నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా. మనమందరం గర్వపడే సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను: హీరో దుల్కర్ సల్మాన్
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి. ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మీ అందరి ప్రేమ, అభిమానానికి థాంక్యూ. ఒక ఆర్మీలా నా వెనుక ఉండి నన్ను ప్రేమించే నా ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్‌ను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. నాకు దుల్కర్ గారంటే చాలా ఇష్టం. మలయాళం, తమిళం, హిందీ, తెలుగు ఇలా అన్నీ భాషల్లో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ ఇలా ఆయన విజయాలు కొనసాగుతున్నాయి. ఆయన వెర్సటైల్ యాక్టర్. సినిమాల ఎంపిక కూడా చాలా బాగుంటుంది. చాలా స్వీట్ పర్సన్, వండర్ఫుల్ పర్సన్. కేరళలో మెగాస్టార్ మమ్ముట్టి గారి అబ్బాయి అయినప్పటికీ చాలా హంబుల్‌గా ఉంటారు. అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. . అదే ఆయనకు మంచి సక్సెస్‌ను తీసుకొస్తుంది. నిర్మాతగా కూడా ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన నిర్మించిన ‘లోక’ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఆకాశంలో ఒక తార ఆయన కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుంది ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతున్న సాత్వికకు ఆల్ ది బెస్ట్. వెల్ కం టు తెలుగు సినిమా. శ్రుతి హాసన్ లాంటి కమర్షియల్ స్టార్ ఈ సినిమాలో కీలక పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రుహాని కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. జీవీ ప్రకాష్ గారు ‘ఇరుముడి’, ‘లక్కీ భాస్కర్’, ‘విశ్వనాథన్’ ఇలా వరుసగా మంచి సినిమాలు, విజయాలు అందిస్తున్నారు. పవన్ సాధినేని తొలి సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చాలా అద్భుతంగా తీశాడు. తనను పిలిపించి మాట్లాడాను. తను చాలా టాలెంటెడ్ డైరెక్టర్. సరైన సమయం వచ్చినప్పుడు తన టాలెంట్‌ను నిరూపించుకుంటాడని అనిపించింది. ఈ సినిమాలో ఆ ఎనర్జీ కనిపిస్తోంది. మా నాన్నగారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. విద్యా అక్క సీఈవోగా ఉన్నారు. స్వప్న గారు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. దత్తు గారి లెగసీని వారు ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. వాళ్లు చాలా అద్భుతమైన సినిమాలను నిర్మిస్తున్నారు. వారి విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. గుణ్ణం గంగరాజు గారి కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వారికి ఆల్ ది బెస్ట్. మా నాన్నగారు చాలా సినిమాలు చూస్తుంటారు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మామూలుగానే ఉంటారు. కానీ ఈ సినిమా చూసి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సినిమా చాలా బాగుందని, మనసుకు బాగా నచ్చిందని చెప్పారు. ఆయన ఎప్పుడో కానీ అలా చెప్పరు. నా సినిమాల గురించి కూడా అంతగా చెప్పరు. అలాంటిది ఈ సినిమా గురించి అలా అన్నారంటే కచ్చితంగా ఇందులో మంచి సోల్ ఉందని అర్థం. ఈ సినిమాలో మొత్తం పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ప్రతి అమ్మాయి కల నెరవేరాలనేది ఇందులోని ప్రధాన అంశం. చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అభిమానులందరికీ థాంక్యూ.
హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘సీతారామం’ తర్వాత ఈ కథ విన్నాను. కథ విన్నప్పుడే చాలా స్పెషల్‌గా అనిపించింది. కచ్చితంగా ఇది నా కెరీర్లో ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందని నమ్ముతున్నాను. స్వప్నకు, అల్లు అరవింద్ గారికి థాంక్యూ. అల్లు అరవింద్ గారు చాలా డెడికేషన్‌తో వర్క్ చేస్తారు. ఆయన ఎంతో ఎనర్జీగా ఉంటారు. బహుశా బన్నీ గారు కూడా అంత ఎనర్జీగా ఉండటానికి కారణం అరవింద్ గారే. గుణ్ణం గంగరాజు గారికి థాంక్యూ. వారితో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. అలాగే రాజ్‌కుమార్, మహేశ్‌లతో కలిసి పనిచేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. శ్వాసిక మా అక్క పాత్రలో కనిపిస్తుంది. రుహాని బిజిలి పాత్రలో కనిపిస్తుంది. మొదటి షెడ్యూల్లో రుహాని గారితోనే కలిసి పనిచేశాను. జీవీ ప్రకాష్ ఈ సినిమా కథ విన్నప్పుడే బ్లాక్‌బస్టర్ అని చెప్పారు. తను ఒక సినిమా బాగుందని చెప్పాడంటే కచ్చితంగా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని నాకు తెలుసు. అలాంటిది ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పడం నాకు మరింత నమ్మకాన్ని ఇచ్చింది. డైరెక్టర్ పవన్ ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో పనిచేశారు. ఆయనకు కథపై చాలా క్లారిటీ ఉంది. సాత్విక అమెరికాలో పుట్టి పెరిగింది. తను నటి కావాలని అనుకున్నప్పుడు, ఆ కలను నిజం చేసుకునేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. నిజంగా తను ఒక ఇన్స్పిరేషన్. శ్రుతి హాసన్ ఈ సినిమాకు లైవ్ వైర్లా నిలిచారు. అద్భుతమైన ఎనర్జీతో నటించారు. తనతో కలిసి పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. బన్నీ గారికి సంబంధించిన ఒక మంచి సంఘటన మీతో పంచుకోవాలి. నా మొదటి సినిమా షూటింగ్ కేరళలోని ఒక పల్లెటూరిలో జరిగింది. అక్కడ నేను ఉంటున్న ఇంట్లో ఒక బీరువా మీద బన్నీ గారి ఫోటో ఉండేది. అప్పటికే ఆయన స్టార్‌గా ఎంతో పేరు సంపాదించారు. ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకున్నారు. ‘అల వైకుంఠపురములో’ నాకు ఫేవరెట్ సినిమా. కరోనా సమయంలో మా ఫ్యామిలీ అంతా కలిసి ఎన్నోసార్లు ఆ సినిమా చూశాం. అలాగే అల్లు అర్జున్ గారికి మా పాప పెద్ద ఫ్యాన్. ఆయన మా వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉంది.‘ఆకాశంలో ఒక తార’ కచ్చితంగా మనమందరం గర్వపడే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.
డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ.. “ముందుగా బన్నీ అన్నకు థాంక్యూ. నా మొదటి సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చూసి, ‘రేసుగుర్రం’ సక్సెస్ పార్టీకి పిలిపించి ఆయన నన్ను ప్రోత్సహించిన విధానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అదంతా నాకు ఒక కలలా అనిపించింది. ఆయన చెప్పిన మాటే ఈ 13 ఏళ్లుగా నన్ను ముందుకు నడిపించింది.కరోనా సమయంలో ఈ కథ రాశాను. ఈ కథను అరవింద్ గారికి, గుణ్ణం గంగరాజు గారికి చెప్పగానే వాళ్లకు చాలా నచ్చింది. స్వప్న గారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన తర్వాత అంతా ఒక మ్యాజిక్‌లా జరిగింది. సుచిత్రన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. జీవీ ప్రకాష్ గారు కథ విన్న వెంటనే ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పారు. ఆయన అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.దుల్కర్ గారు కథ చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు నాపై ఎంతో నమ్మకం ఉంచి, నన్ను ప్రోత్సహించారు. ఆయన లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. సాత్విక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ తన గురించి మాట్లాడుకుంటారు. అలాగే కథ విన్న వెంటనే శ్రుతి హాసన్ గారు తన క్యారెక్టర్ చేయడానికి అంగీకరించారు. అది మాకు మరింత స్పెషల్‌గా అనిపించింది. చైతు సహా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. ప్రతి ఆడపిల్ల కల సాకారం చేయడానికి సహకరించాలి. కచ్చితంగా ఇది ఒక స్ఫూర్తినిచ్చే సినిమాగా మీరందరూ ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను.
హీరోయిన్ సాత్విక మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా నిర్మాతలకు ధన్యవాదాలు. మా టీమ్‌లో ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. రుహాని గారు, శ్రుతి హాసన్ గారు, శ్వాసిక గారు.. ఇలా అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు.అల్లు అర్జున్ గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో కలిసి ఒక్కసారైనా డాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో దుల్కర్ గారితో కలిసి పనిచేయడం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. సెట్స్‌లో మేము ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాళ్లం. అలా గొడవ పడకపోతే ఏదో నార్మల్‌గా లేదనిపించేది. నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే మొదట వచ్చేది ఆయనే. ఈ స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మా డైరెక్టర్ నాపై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తుంది. ప్రేక్షకులు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బన్నీ ఫ్యాన్స్‌కు, దుల్కర్ ఫ్యాన్స్‌కు నమస్తే. మొన్న దుల్కర్ టూర్‌కు వెళ్లినప్పుడు అక్కడి ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. నేను దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నాను. ఎన్నో హిట్ సినిమాలు, బ్లాక్‌బస్టర్స్ చేశాను. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు కలిగిన ఎక్సైట్మెంట్ వేరు. ఇంత గొప్ప కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నామనే ఆలోచనే చాలా ఆనందాన్నిచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు హీరో, హీరోయిన్ ఇద్దరూ చాలా ముద్దొచ్చేశారు. అంత అద్భుతంగా నటించారు. దుల్కర్ చాలా మంచి మనిషి. ఈ సినిమాలోని క్యారెక్టర్ కంటే కూడా తను చాలా సౌమ్యుడు, సున్నితమైన మనిషి. సాత్విక కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ క్యారెక్టర్లో చాలా నేచురల్‌గా ఒదిగిపోయింది. మరో రెండు సినిమాలకు సంబంధించి తనతో కాంట్రాక్టులు కూడా రాసుకున్నాను.(నవ్వుతూ) తను స్టార్ అవుతుందనే నమ్మకం ఉంది. పవన్‌తో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. తన మొదటి సినిమా చూసినప్పుడే తనతో సినిమా చేయాలని అనుకున్నాను. అశ్వినీదత్ గారు, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కలిసి ఏడు సినిమాలు చేశాం. ఇప్పుడు వాళ్ల అమ్మాయితో కలిసి సినిమా చేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.
ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బన్నీకి థాంక్యూ. ఈ సినిమా ఒరిజినల్‌గా సందీప్, రమ్యలది. దుల్కర్ ఫోన్ చేసి ‘ఒకసారి కథ వింటావా?’ అని అడిగారు. ఆ కథ విన్న తర్వాత ఇలాంటి మంచి కథలు మళ్లీ మళ్లీ మనకు వస్తాయో రావో అనిపించింది. అంతటి ఉత్సాహంతో ఈ సినిమాను చేశాం. దుల్కర్‌తో మరోసారి కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అలాగే అల్లు అరవింద్ గారితో కలిసి పనిచేశాను. ఆయనతో వర్క్ చేయడం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. శ్రుతి హాసన్, శ్వాసిక, రుహాని శర్మ.. ఇలా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. “లక్కీ భాస్కర్, ఇరుముడి, విశ్వనాథన్ తర్వాత ఇది నా మరో తెలుగు సినిమా. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదొక గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. ఇంత మంచి కథను అందించిన దర్శకుడు పవన్‌కు థాంక్యూ. అల్లు అరవింద్ గారికి, స్వప్న గారికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు”
రైటర్ గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ.. “లిటిల్ సోల్జర్స్ సినిమా షూటింగ్‌కు ముందు సీతారామశాస్త్రి గారు రాసిన ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ పాట లిరిక్స్‌ను మొదటి పేజీలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ కథ షూటింగ్ స్టేజ్‌లోకి రావడానికి 12 ఏళ్లు పట్టింది. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత ‘ఆకాశంలో ఒక తార’ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు మళ్లీ ఆ స్ఫూర్తినిచ్చే పాట గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ కథ కూడా అలాంటిదే. ఒక మారుమూల పల్లెటూరిలో మెరిసిన ఓ కల ఇది. అలాంటి అద్భుతమైన కథను నమ్మి సందీప్, రమ్య గున్నం బలంగా ముందుకు తీసుకెళ్లారు. వారికి స్వప్న రూపంలో బలమైన తోడు దొరికింది. తన పేరుకు తగ్గట్టుగానే ఈ కలను నెరవేర్చడానికి స్వప్న పూనుకున్నారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్తారు”
ప్రొడ్యూసర్ సందీప్ గున్నం మాట్లాడుతూ.. “మంచి కథలు చెప్పాలనేది మా డ్రీమ్. ఈ విషయంలో అరవింద్ గారికి, స్వప్న గారికి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ల వల్లే ఈ జర్నీ సాధ్యపడింది. ఇది చాలా మంచి కథ. స్ఫూర్తినిచ్చే కథ. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.
చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ..గత ఏడాది నవంబర్ 20న ‘రాజు వెడ్స్ రాంబాయి’ వచ్చింది. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ వస్తోంది. అలాగే మమ్ముట్టి గారితో ‘ఓం’ సినిమా కూడా చేస్తున్నాను. ఇది నాకు లక్కీ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థాంక్యూ. దుల్కర్ గారు చాలా స్వీట్ పర్సన్. ఇది చాలా బ్యూటిఫుల్ సినిమా. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.
శ్వాసిక మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలకు, డైరెక్టర్ పవన్ గారికి థాంక్యూ. దుల్కర్ గారితో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. నవంబర్ 20న సినిమా చూడండి. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి”
రుహాని శర్మ మాట్లాడుతూ.. “ ‘ఆకాశంలో ఒక తార’ కథ నాకు పర్సనల్‌గా కనెక్ట్ అయింది. మన పరిస్థితుల వల్ల మన కలలను ఎప్పుడూ పరిమితం చేసుకోకూడదు. ఈ సినిమాలో నేను ఒక స్పెషల్ రోల్ ప్లే చేశాను. నా పాత్ర పేరు బిజిలి. ఆ పాత్ర నాకు చాలా స్పెషల్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ పవన్ గారికి థాంక్యూ. దుల్కర్ గారితో మరిన్ని సినిమాల్లో కలిసి పనిచేయాలని ఉంది. శ్రుతి హాసన్ గారు కూడా ఇందులో అద్భుతమైన పాత్ర చేశారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడండి. మీ ఇంట్లోని ఆడపిల్లలను కూడా సినిమాకు తీసుకెళ్లండి. థాంక్యూ సో మచ్
లిరిక్ రైటర్ శ్రీమణి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో పాటల ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. పవన్ గారు ఈ కథ చెప్పినప్పుడు అద్భుతంగా అనిపించింది. ఈ ఆల్బమ్ నాకు చాలా స్పెషల్. మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడికి ధన్యవాదాలు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.



