‘డార్క్ చాక్లెట్’ యూఎస్ ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా ఎంగేజింగ్‌గా ఉందని ఆడియన్స్ చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: హీరో విశ్వదేవ్ రాచకొండ
విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్‌లో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. యూఎస్ ప్రీమియర్స్‌లోనూ అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా నవంబర్ 13న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వదేవ్ రాచకొండ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
యూఎస్ ప్రీమియర్స్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
యూఎస్ రివ్యూస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్, ఆడియన్స్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని చెబుతున్నారు. అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత ఎంగేజింగ్‌గా ఉన్న సినిమా ఇదే అని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఇందులో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు?
-ఇందులో నా పాత్ర పేరు యజ్ఞ. తను ఒక సినిమాలో హీరోగా వరుసగా మూడు హిట్స్ కొట్టి, ఆ తర్వాత కొన్ని అపజయాలు చూసి డౌన్‌ఫాల్‌లో ఉంటాడు. కాస్త పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. ఇష్టానుసారంగా బిహేవ్ చేసే క్యారెక్టర్. తనను ఫిల్మ్ ఛాంబర్ నుంచి బ్యాన్ చేస్తారు. దీంతో తనకు ఎవరూ అక్కర్లేదని, తానే అన్నీ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. డైరెక్షన్, మాటలు, పాటలు, కొరియోగ్రఫీ.. అన్నీ తానే చూసుకోవాలనుకుంటాడు.
అక్కడి నుంచి ఒక కథ రాయడం మొదలుపెడతాడు. అతనికి పిచ్చిపిచ్చి కలలు వస్తుంటాయి. ఆ కలలేంటి? ఆ కలల్లోకి ఎవరు వస్తున్నారు? తన బెస్ట్ ఫ్రెండ్, తన లవ్ ఇంట్రెస్ట్, అలాగే తన బాబాయ్ క్యారెక్టర్‌తో తన జర్నీ ఎలా ఉంటుంది? నిజంగా వాళ్లు వచ్చారా? లేకపోతే కలలో కనిపించారా? ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా ఇలాంటి సినిమా ఎక్కడా, ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు. కచ్చితంగా ఒక కొత్త సినిమా తీశాం. ఇది ఆడియన్స్ అందరికీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. ఇందులో డైలాగ్స్ చాలా ప్రధానంగా ఉంటాయి. ఒక క్యారెక్టర్ ఏం చెబుతుంది? దానికి అవతలి క్యారెక్టర్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది? అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇది ఏ జోనర్ సినిమా?
ఇది సర్వైవల్ డ్రామా, డార్క్ కామెడీ, మ్యూజికల్, సైకలాజికల్ థ్రిల్లర్.. ఇలా ఉత్కంఠగా సాగే సినిమా. ఇందులో సోషల్ కామెంట్రీ కూడా ఉంటుంది. ఇప్పటివరకు చూడని ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను క్రియేట్ చేశాం.
-ఇందులో నా క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది. హీరోతో పాటు మిగతా క్యారెక్టర్లు కూడా చాలా కీలకంగా ఉంటాయి. సినిమా చాప్టర్లుగా ఉంటుంది.
సినిమా బిజినెస్ పరంగా ఎలా ఉంది?
-బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటికే సీక్రెట్ స్క్రీనింగ్ వేశాం. అక్కడికి వచ్చిన వాళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ మాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ఫిల్మ్ మేకర్స్‌కు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది.
-మాటలతో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసే ఒక ప్రయోగం ఇందులో చేశాం. అది చాలా అద్భుతంగా వచ్చింది. ‘పరేషాన్’, ‘35’ సినిమాల కథలు విన్నప్పుడే కచ్చితంగా ఆడియన్స్‌కు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయని అనిపించింది. డార్క్ చాక్లెట్ కథ కూడా కొత్తగా అనిపించింది.
మీ తాతగారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి రచనలు చదివారా?
కొన్ని చదివాను. తాతగారు సాహిత్యం వైపు ఉండేవారు. నేను డాన్స్, మ్యూజిక్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపించేవాడిని. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, మేమందరం కలిసి ఒక మ్యూజిక్ ట్రూప్ ఉండేది. అందులో నేను వోకల్స్ , గిటార్ ప్లే చేసేవాడిని.
బిందు మాధవి పెర్ఫార్మెన్స్ గురించి?
బిందు ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇందులో ఇచ్చిందని సినిమా చూసిన వాళ్లందరూ చెబుతున్నారు.
రానా గారి సపోర్ట్ ఎలా ఉంది?
ఆయన ప్రొడక్షన్ పేరు స్పిరిట్ మీడియా. ఆయన ఎప్పుడూ కొత్త కంటెంట్‌ను, కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారు. పారేషన్ , 35 సపోర్ట్ చేశారు. ఇప్పుడు ‘డార్క్ చాక్లెట్’కు కూడా మంచి రిలీజ్ ఇస్తున్నారు. మేము కలిసి మరింత మంచి కంటెంట్ ఇవ్వాలని ప్లాన్స్ కూడా ఉన్నాయి. రానా గారు చాలా ఇన్నోవేటివ్ పర్సన్.
మీ నుంచి కొత్తగా రాబోతున్న సినిమాలు ఏమిటి?
-ప్రస్తుతం నా దగ్గరకు మంచి కథలు వస్తున్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేశాను. నా నుంచి రాబోయే రోజుల్లో చాలా మంచి సినిమాలు చూడబోతున్నారు. అవన్నీ కూడా అందరూ గొప్పగా మాట్లాడుకునే సినిమాలే అవుతాయని నమ్ముతున్నాను. అలాగే మా ప్రొడక్షన్‌లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి.



