స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ ‘సిద్ధు10’ ఘనంగా ప్రారంభం 

0
1
#Siddhu10 Launched Grandly with Pooja Ceremony
#Siddhu10 Launched Grandly with Pooja Ceremony
తబిత సుకుమార్ ప్రజెంట్స్, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, మోహన్ బి, ‘సిద్ధు10’ ఘనంగా ప్రారంభం 
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రం ‘సిద్ధు10’లో సరికొత్త ప్రేమకథతో అలరించబోతున్నారు. తబిత సుకుమార్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో మోహన్ బి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
‘ఇడుపు కాయితం’ తర్వాత సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ కలిసి నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ప్రస్తుతం ‘ఇడుపు కాయితం’ విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రముఖ కథా రచయిత సుకుమార్ టీమ్‌లో కీలకంగా ఉన్న మోహన్ బి.. ఈ సినిమా కోసం ఒక అందమైన, కొత్త తరహా ప్రేమకథను సిద్ధం చేశారు. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డను పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, విభిన్నమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు.. ఈ కొత్త కాంబినేషన్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. సిద్ధుకు జోడీగా నయన్ సారిక హీరోయిన్‌గా నటించనున్నారు.
ఈ సినిమా హైదరాబాద్‌లో నేడు సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మాస్టర్ స్టొరీ టెల్లర్ సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తొలి క్లాప్ కొట్టారు. నిర్మాతలు విశ్వప్రసాద్, బాపినీడు, దర్శకులు బుచ్చిబాబు, చందూ మొండేటి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. దర్శకులు హరీశ్ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంతో సినిమా ప్రయాణం శుభారంభమైంది.
సినిమా ప్రారంభోత్సవంతో పాటు ఆసక్తికరమైన థీమ్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అందమైన చెట్టుతో చుట్టుముట్టబడిన భారీ జలపాతం, దాని మధ్యలో వేలాడుతున్న ఉయ్యాల కనిపిస్తున్నాయి. ఎరుపు, పసుపు, నలుపు రంగుల్లో ప్రవహిస్తున్న వస్త్రం ఈ విజువల్ కు ప్రత్యేకత తీసుకొచ్చింది. పోస్టర్‌లోని విజువల్స్ నాస్టాల్జియా, ప్రేమ, కవితాత్మకమైన అందాన్ని చూపిస్తున్నాయి. సినిమా కథలోని భావోద్వేగ ప్రపంచాన్ని, అందమైన ప్రేమకథను ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు.
ఈ చిత్రానికి ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ ఈ సినిమా విజువల్ వరల్డ్‌ను రూపొందించనున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, దర్శకుడు మోహన్ బి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సిద్ధు10’ తెలుగు సినిమాలో ప్రత్యేకమైన ప్రేమకథగా నిలవనుంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
నటీనటులు: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, నయన్ సారిక
సాంకేతిక బృందం:
దర్శకత్వం: మోహన్ బి
సమర్పణ: తబిత సుకుమార్
నిర్మాతలు: అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి
బ్యానర్లు: సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
పీఆర్వోలు: వంశీ శేఖర్ – మాడూరి మధు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here